♦జనాస్త్రం ప్రతినిది మారంరెడ్డి జనార్ధనరెడ్డి
♣ స్పందిస్తారా … సైలెంట్ అవుతారా ?
♣ అంతుపట్టని శిల్పా వైఖరి
♣ రాజీ కుదరకుంటే కోట్ల అక్రమాలు వెలుగులోకి
♣ తలలు పట్టుకుంటున్న అధికారులు
♣ సమావేశానికి డుమ్మా కోట్టడమే శరణ్యమా
మరో నాలుగు రోజుల్లో నంద్యాల పురపాలక సంఘం సమావేశం జరుగనున్నది. ఈ సమావేశంలో 18వ వార్డు కౌన్సిలర్, మాజీ మున్సిపల్ ఛైర్మన్ దేశం సులోచన సంధించిన అవినీతి అక్రమాల పై మున్సిపల్ ఛైర్మన్ మాబున్నిసా గానీ, మున్సిపల్ కమీషనర్ నిరంజన్ రెడ్డి గాని స్పందిస్తారా లేక ఈ ముగ్గురిని సైలెంట్ చేస్తారా అనే చర్చ సాగుతున్నది. నంద్యాల పురపాలక సంఘంలో రూ. 40 లక్షలు ముందస్తుగా డ్రా చేయబోతున్నారని దేశం సులోచన ఆరోపించారు. అధికార పార్టీకి చెందిన కౌన్సిలర్ కావడమే కాకుండా శిల్పా కుటుంబంలో ఒకరు దేశం సులోచన. ఎప్పుడు సైలెంట్‌గా సమావేశానికి హాజరైయ్యే సులోచనకు ఎందుకు కోపం వచ్చందో అర్థం కావడం లేదు. పది రోజులకే అత్యవసర సమావేశం నిర్వహించి శ్వేత పత్రాన్ని విడుదల చేయాలని లేని పక్షంలో ప్రజల్లో చులకన అవుతామని ఆమె అన్నారు. ఈ విషయంలో ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిషోర్ రెడ్డి, మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి జోక్యం చేసుకుంటే తప్ప సమస్య పరిష్కారం కాదు. సులోచన అడిగిన ప్రశ్నలకు సమాధానం దొరకడం కష్టం. ఐదేళ్ల పాటు ఛైర్మన్‌గా కొనసాగిన దేశం సులోచన ఆఫీస్‌లో జరుగుతున్న అక్రమాలను అసంతృప్తిపరులైన కౌన్సిలర్‌లే ఉప్పు అందించారని అక్కడ జరుగుతున్న అక్రమాలలో వీరికి వాట అందకపోవడం తో ఆగ్రహాంగా ఉన్నట్లు తెలుస్తొంది. ఎన్‌జిఓ కాలనీలో 20 కోట్లు విలువ చేసే మున్సిపల్ స్థలం రిజిస్ట్రేషన్‌లో కుడా కోట్ల రూపాయల మార్పిడి జరిగిందని ఇందులో ఎవరి హస్తం ఉందో తేల్చాలని కుడా దేశం సులోచన పట్టుబట్టే అవకాశం ఉంది. అలాగే గత 20 రోజుల నుంచి అంసతృప్తి కౌన్సిలర్లు గత సమావేశంలో ఆరోపించివే కాకుండా తాజాగా నంద్యాల పట్టణంలో బినామి పేర్లతో ఖరీదైనా ఇళ్ల స్థలాలతో పాటు మరికొన్ని అక్రమాలకు పాల్పడ్డారని వాటిని కుడా వెలుగులోకి తేవాలని దేశం సులోచన దృష్టికి తెస్తున్నట్లు సమాచారం. అయితే శిల్పా కుటుంబీకులు కౌన్సిలర్లతో సమావేశమై పరిష్కారం చేయాలి. ఇందులో దేశం సులోచన గానీ మున్సిపల్ ఛైర్మన్ గానీ ఎవరు తగ్గే అవకాశం లేదు. ఇరువురిలో ఒకరు గానీ ఇద్దరూ గానీ సమావేశానికి డుమ్మా కొడితే తప్ప ప్రశాంతంగా సభ సాగదని అంటున్నారు. నూరు ఆరైనా … ఆరు నూరైనా తమే నెగ్గాలని సులోచన పట్టుదలతో ఉన్నారు. మొత్తం మీద ఈ సందేహలన్నిటికి 29వ తేది సమాధానం దొరుకుతుంది.