♦జనాస్త్రం ప్రతినిది మారంరెడ్డిజనార్ధనరెడ్డి
⇔ పాణ్యం పరిశీలకుడిగా పిపి నాగిరెడ్డి
⇔ మార్క్‌ఫెడ్ ఛైర్మన్‌గా పని చేస్తున్న పిపి
⇔ భారీ ఓటర్ల బలం ఉన్న పిపి
⇔ ఆయన ఎవరి జోలికి వెళ్లడు … వెళ్తే
రాజకీయంలో ఆయన ఎవరి జోలికి వెళ్లడు… ఆయన జోలికి వెళ్తే పరిస్థితిని బట్టి స్పందిస్తాడు. ఇది ఒక విలక్షణమైన లక్షణంగా చర్చించుకుంటుంటారు. అలాగే ఆయన అనుచరుల కోసం ఏ పని కోసమైనా ఉడుం పట్టు పడతారు. ఆయనకు ఒక పని చెబితే ఆ పని పూర్తి అయ్యేంతవరకు వదిలి పెట్టరు. ఒకసారి ఆయనకు చెప్పిన తరువాత మరోసారి గుర్తు చేయడానికి ఆయన దగ్గరికి వెళ్ళాల్సిన పని లేదు. నాగిరెడ్డే స్వయంగా ఫోన్ చేసి మీ పని పలన చోట ఉంది. త్వరలో అయ్యే అవకాశం ఉంది లేని పక్షంలో మీరు పలాన డాక్యుమెంట్లు ఇవ్వాలని చెబుతాడు. అందుకే ఆయనను చాల మంది లైక్ చేసి ఆయన ఉన్న పార్టీకి ఓట్లు వేస్తుంటారు.
సీనియర్ వైకాపా నాయకుడు, రాష్ట్ర మార్క్‌ఫెడ్ ఛైర్మన్ పిపి నాగిరెడ్డిని పాణ్యం నియోజకవర్గ పరిశీలకుడిగా నియమించారు. శుక్రవారం వైకాపా రాష్ట్ర కార్యాలయం నుంచి ఈ ఉత్తర్వులు వెలువడ్డాయి. 65 ఏళ్లకు పైగా వయస్సు ఉన్న పిపి నాగిరెడ్డి నంద్యాల నియోజకవర్గంలో భారీగా ఓటర్లను ఆకర్షించే శక్తి ఉంది. ఆయన ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉంటుంది. వివాదాలకు దూరంగా ఉండే నాగిరెడ్డి జడ్పి ఛైర్మన్‌గానూ, సహకార బ్యాంక్ ఛైర్మన్ గానూ గతంలో పని చేశారు. ప్రస్తుతం రాష్ట్ర మార్క్‌ఫెడ్ ఛైర్మన్‌గానూ పని చేస్తున్నారు. ఈయనకు పాణ్యం శాసన సభ్యుడు రాంభూపాల్ రెడ్డికి సన్నిహీత సంబంధాలు ఉన్నాయి. గతంలో నాగిరెడ్డి సొంత మండలమైన గోస్పాడు ఆళ్లగడ్డ నియోజకవర్గంలో ఉండేది. అక్కడ ఉప ఎన్నికలు అధికంగా జరగడంతో రాజకీయంతో ఎన్నికల అవగాహన సంపూర్ణంగా ఉంది. 2009 నుంచి గోస్పాడు, నంద్యాల నియోజకవర్గంలో కలవడంతో ఇక్కడ ప్రత్యక్ష రాజకీయాల్లో కొనసాగుతున్నారు. ఆళ్లగడ్డ, శ్రీశైలం నియోజకవర్గాల్లో భారీ అనుచరు గణం ఉన్న పిపి నాగిరెడ్డి అనుభవాన్ని ఎన్నికల్లో వాడుకోవడానికి జగన్ నిర్ణయించుకొని ఈ పదవీ ఇచ్చినట్లు సమాచారం. ఈ పదవులను జగన్‌కు అత్యంత సన్నిహీతులు, పార్టీ విధేయులైన వారినే నియమిస్తారు.