జనాస్త్రం ప్రతినిది మారంరెడ్డి జనార్దన రెడ్డి
సత్తా చాటిన దేశం దంపతులు
రూ.4కోట్ల అబివృద్దికి శిల్పా ప్రారంభోత్సవాలు
జగన్,శిల్పాల నినాదాలతో మారుమోగిన ఎన్జిఓ కాలనీ
వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో జరుగుతున్న గడపగడప కార్యక్రమం నంద్యాల పట్టణంలోని ఎన్జిఓ కాలనీ 18వ వార్డులో భారీ ఎత్తున జరిగింది. రెండు రోజుల పాటు జరిగిన గడప గడప కార్యక్రమానికి నంద్యాల ఎంపీ పోచా బ్రహ్మానంద రెడ్డి, ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డిని వైసీపీ కౌన్సిలర్ దేశం సులోచన, సుధాకరరెడ్డి ఆహ్వానించి విజయ వంతం చేశారు. 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 18వ వార్డులో వచ్చిన మెజార్టీని తిరిగి వచ్చే విధంగా సుధాకర్ రెడ్డి, సులోచనలు కృషి చేస్తున్నారు. గత రెండు రోజుల నుండి వార్డులో చేపట్టిన దాదాపు రూ. 4 కోట్లు విలువ చేసే నిర్మాణాలకు ప్రారంభోత్సవం చేశారు. 18వ వార్డులో దాదాపు 4వేల ఓట్లు ఉన్నాయి. వారందరినీ సంతృప్తి పరిచే విధంగా ఈ అభివృద్ధి కార్యక్రమాలు సులోచన చేపట్టిందని సమావేశంలో పాల్గొన్న వైసీపీ నాయకులు గోవింద రెడ్డి, ఉయ్యాలవాడ వెంకటేశ్వర రెడ్డి, చింతకుంట రవి రెడ్డిలు పేర్కొన్నారు. దేశం సులోచన ఆధ్వర్యంలో 500ల మందికి పైగా మహిళలను, సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో మరో 800ల మంది, ప్రతిరోజూ ప్రతి కార్యక్రమానికి హాజరయ్యే విధంగా చర్యలు తీసుకోవడంతో కార్యక్రమం జోష్ నింపింది. వైఎస్ జగన్ జిందాబాద్.. శిల్పా కుటుంబం జిందాబాద్ అంటూ జనాలు జే కొట్టడంతో ఎన్టీఓ కాలనీ నినాదాల హెూరుతో మారు మోగిపోయింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రవి మాట్లాడుతూ దేశం సుధాకర్ రెడ్డి, సులోచన ఆధ్వర్యంలో 18వ వార్డులో భారీగా అభివృద్ధి చేపట్టడం జరిగిందని, భవిష్యత్తులో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టే బలం ఇవ్వాలని కోరారు. దేశం సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ కాలనీ అభివృద్ధి చెందిందంటే మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి ,ప్రస్తుత ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డిలు అని అన్నారు.