టీడీపీ అభ్యర్థిగా నారా బ్రాహ్మణీ..?

జనాస్త్రo ప్రతినిధి మారం రెడ్డి జనార్దన రెడ్డి

#టీడీపీ అభ్యర్థిగా నారా బ్రాహ్మణీ.
 #నంద్యాల నుండి అరంగేట్రంకు బ్రాహ్మణీ తహతహ…
# కసి తీర్చుకునే యత్నంలో బాబు.

నాలుగు ఎన్నికల తర్వాతైనా దేశం విజయం కోససం వ్యూహం ..

తెలుగుదేశం పార్టీ యువ నాయకురాలు, ఎన్‌టీఆర్‌ మనువరాలు లోకేష్‌ సతీమణి నారా బ్రాహ్మణీ రాజకీయ అరంగేట్రం నంద్యాల పార్లమెంటు నుండి ఆరంభం అవుతుందా ? అనే చర్చ తెలుగుదేశం పార్టీలో జరుగుతున్నది. జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన నంద్యాల లోక్‌సభ నుండి రాజకీయ అరంగేట్రం చేస్తే తమ రాజకీయ జీవితం మూడు పువ్వులు.. ఆరు కాయలుగా వర్థిల్లితుందని బ్రాహ్మణి భావిస్తున్నట్లు సమాచారం. అంతేకాక మూడు మాసాల క్రితం బ్రాహ్మణి మామ నారా చంద్రబాబు నాయుడు నంద్యాలలో అరెస్ట్‌ కావడం నారా, నందమూరి కుటుంబాలు తీవ్రంగా బాధపడ్డాయి. ఇదే గడ్డమీద నుండి పార్లమెంటుకు పోటీ చేసి తాను విజయం సాధించడమే కాకుండా ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేసే టీడీపీ అభ్యర్థుల గెలుపు కూడా నల్లేరుపై నడకగా ఉంటుందని కూడా టీడీపీ భావిస్తున్నది. ఇంత వరకు నంద్యాల పార్లమెంటు ఇన్‌చార్జిగా మాండ్ర శివానంద రెడ్డి కొనసాగుతున్నారు. ఇతనినే తిరిగి ఈ నియోజకవర్గం నుండి పోటీ చేయిస్తారా? లేక మరొకరిని బరిలోకి దించే విషయం తేలలేదు. దాంతో నేరుగా బ్రాహ్మణిని పార్లమెంటు బరిలోకి దించి 2004, 2009, 2014, 2019 ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం నుండి నారా బ్రాహ్మణీతో విముక్తి పొందాలని చూస్తున్నది. ఎన్‌టీఆర్‌ అభిమానులు భారీ ఎత్తున నంద్యాల పార్లమెంటు నియోజకవర్గంలోని ఆళ్లగడ్డ, బనగానపల్లె, శ్రీశైలం, డోన్‌, నంద్యాల, నందికొట్కూరు, పాణ్యం నియోజకవర్గాల్లో అధికంగా ఉండడం బ్రాహ్మణీ విజయానికి తోడ్పడుతుందని కూడా భావిస్తున్నారు. ఇప్పటికే నారా కుటుంబంలో చంద్రబాబు నాయుడు, లోకేష్‌, బాలకృష్ణలు కుప్పం, మంగళగిరి, హిందూపురంలో తిరిగి పోటీ చేసే అవకాశం ఉండడంతో తమ ఇంట్లో ఒకరిని లోక్‌సభకు పంపితే బాగుటుందనే ఆలోచన ఇరు కుటుంబాలకు ఉందని తెలుస్తోంది. మొత్తం మీద రెండు మూడు రోజుల్లోనే ఈ సస్పెన్ష్‌కు తెర పడుతుందని దేశం నాయకులు చర్చించుకుంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *