!!అన్ సీజన్లో….. లాడ్జిలకు బెస్ట్ చాన్స్.. 3వ తేది సాయంత్రం నుంచే లాడ్జిలు ఫుల్!!

♦జనాస్త్రం ప్రతినిది మారంరెడ్డి జనార్ధనరెడ్డి

⇔తిన్నవాడికి తిన్నంత తాగిన వాడికి తాగినంత.

⇔కౌంటింగ్ ఏజెంట్లకోసం ఏర్పాట్లు

⇔లిక్కర్, బిర్యాని ఏర్పాట్లు…

⇔4న ఆరు అసెంబ్లీల కౌంటింగ్ నంద్యాలలో

 

నంద్యాల పట్టణంలో శుభకార్యక్రమాలు లేక నెలు రోజులు అవుతున్నది. దీంతో లాడ్జిలకు బాడిగలు లేక ఇబ్బందులు పడుతున్నారు. జూన్ 4న నంద్యాల పట్టణంలో 6 అసెంబ్లీలకు చెందిన కౌంటింగ్ జరుగుతుండంతో లాడ్జిలకు కలిసివచ్చింది. పట్టణంలో 10కి పైగా ప్రజలు ఆకర్షించే లాడ్జిలు ఉ న్నాయి. వీటన్నీంటిని శ్రీశైలం, నందికొట్కురు, బనగానపల్లె, ఆళ్ళగడ్డ, డోన్ తదితర నియోజకవర్గాలు చెందిన కాంగ్రెస్ నాయకులు బుక్ చేసుకున్నారు. కొంతమంది లాడ్జి యజమానులు, బాడుగను అమాంతం పెంచేశారు. లాడ్జిలు దొరకని నాయకులు కళ్యాణ మండపాలను బుక్ చేసుకున్నారు. వి.ఐ.పి.లు కూడా అధికంగా వస్తుంటడంతో వారికి ఖరీదైన రూములు కూడా ఏర్పాటు చేస్తున్నారు. పట్టణంలోని ప్రధాన నాన్వెజెటిరియన్ హెూటల్లో ఒక్కొక నియోజక వర్గానికి చెందిన వై.కా.పా, టిడి.పి నాయకులు 500ల నుంచి 1000 బిర్యాని ప్యాకెట్లకు ఆర్డరు ఇచ్చారు. ఇక టిఫన్లు, కాఫీ, టీలు అయితే అన్లిమిటెడ్ సరఫరా చేసే భాద్యతను సబంధిత హెూటల్ యజమానులకు అప్పగించారు. మొత్తం మీద 3వ తేదీ సాయంత్రానికే కౌంటింగ్ ఏజెంట్లు వారి అనుచరులు నంద్యాల పట్టం చేరుకొని 4వ తేది ఉదయం కౌంటింగ్ వెళ్ళె విధంగా  ఏర్పాట్లు చేసుకున్నారు. లిక్కర్ కూడా నియోజకవర్గాల వారిగా, పార్టీల వారిగా చేర్చుకోనే ప్రయత్నాలు సాగుతున్నాయి. మొత్తం మీద కౌంటింగ్ పుణ్యామ అంటు 2, 3 కోట్ల వ్యాపారం జరిగే అవకాశం ఉందని, ఇక పూల దండలు, స్వీట్ ప్యాకెట్లు, పండ్లు లెక్కలెనన్ని ఆర్డర్లు ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *