♦జనాస్త్రం ప్రతినిది మారంరెడ్డి జనార్ధన రెడ్డి
⇔రెండుసార్ల గెలుపు అనుభవం కలిసి వస్తున్నది
⇔చక్రపాణిరెడ్డితో కూడా పరస్పర సహకారంలో మోహనరెడ్డి
⇔అసంతృప్తులను అంకెకు తెస్తున్నమోహనరెడ్డి
⇔వైసిపి కార్యకర్తలలో జోష్
నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గంలో తనయుడిని గెలిపించుకోవడానికి మాజీ మంత్రి శిల్పా మోహనరెడ్డి రంగంలోెకి దిగారు..భారీ ఎత్తున అసంతృప్తితో ఉన్న వైయస్ ఆర్ సిపి, శిల్పా అభిమానులలో పదిశాతం మందిని కోల్పోయిన తొంబై శాతం మందిని తమవైపు తిప్పుకోవడంలో శిల్పా మోహనరెడ్డి వ్యూహం రచించి విజయవంతం అయ్యారని ఆపార్టీ నాయకులు పేర్కొంటున్నారు..2004,2009 ఎన్నికలలో శిల్పా మోహనరెడ్డి నంద్యాలనుంచి పోటీచేసి శిల్పా కుటుంబానికి రాజకీయ బీజం వేశారు..అప్పటినుంచి నంద్యాల రాజకీయాలలో శిల్పా కుటుంబం చక్రం తిప్పుతున్నది..శిల్పా సోదరుడిగా చక్రపాణిరెడ్డి నంద్యాల రాజకీయాలతో అరంగేట్రం చేసి శ్రీశైంల నియోజకవర్గంనుంచి పోటీచేసి విజయం సాదించారు..ఆతరువాత ఎంఎల్సిగా కూడా విధులు నిర్వహించారు..ప్రస్తుతం ఇద్దరూ తమ మద్య ఉన్న స్వల్ప విభేదాలను పక్కకు పెట్టి ఒకరికొకరు సహకారం అందించుకుంటూ విజయానికి కృషిచేస్తున్నారు..బండి ఆత్మకూరు మహానంది మండలాలలో ఇప్పటికి శిల్పా మోహనరెడ్డి పట్టు ఉండటంతో అక్కడ తనకున్న పరిచయాలను చక్రపాణిరెడ్డి దరికి చేర్చుతున్నారు..ఇక్కడ కూడా మోహనరెడ్డి అంకెకు రాని రాజగోపాల్ రెడ్డితోపాటు మరికొంతమందిని చక్రపాణి రెడ్డి వైయస్ ఆర్ సి పి అభ్యర్ధి రవిచంద్రకిషోర్ రెడ్డితో రాజీ కుదుర్చి ముందుకు సాగుతున్నారు..ఇదంతా శిాల్పా మోహనరెడ్డి వ్యూహమేనని పేర్కొంటున్నారు..ఓటర్లలో బలమున్న నాయకులు ఏపార్టీకి చెందినా వారితో మద్యవర్తుల ద్వారాగాని స్వయంగా గాని మాట్లాడి పార్టీలోకి రప్పించే యత్నం చేస్తున్నారు..ఎవరు ఏవిదంగా ఉపయోగపడతారో వారందరిని ఎన్నికలలో వాడుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలు తొంభై శాతం విజయవంతం అయ్యాయని పార్టీ కార్యకర్తలు జోష్ లో ఉన్నారు..మొత్తం మీద శిల్పారవి విజయం వెనుక తండ్రి పాత్ర అమోఘంగా ఉన్నదని ఆపార్టీ నాయకులు చర్చించుకుంటున్నారు..