నంద్యాల అసెంబ్లీ, నియోజకవర్గంలో భారీ విజయమే లక్ష్యంగా ఎమ్మెల్యే రవిచంద్రకిషోర్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఏ సమయాన్ని ఎలా వాడుకోవాలో అలానే వాడుకుంటూ రవి ముందుకు సాగుతున్నారు. రోజు జరిగే సభలు సమావేశాల్లో తన ప్రత్యర్థులు తన పై విసిరిన సవాళ్లను కొన్నిటిని స్వీకరించి వాటికి సీరియస్‌గానూ, సేటైరస్గానూ కార్యకర్తలకు బహిరంగంగానూ ప్రజలకు కేబుల్ చానల్, పత్రికల ద్వారా వివరించే ప్రయత్నం చేస్తున్నారు. కొద్ది రోజుల వరకు మజా లేని ప్రంసగాలను రవి చేస్తున్నారని ,సభికులను ఆకట్టుకోలేకపోతున్నాయని కొందరురవికి సూచించినట్లు సమాచారం. దీంతో తన ప్రసంగాల బాణిని మార్చేశారు. నవ్వుతునే ప్రత్యర్థులకు కౌంటర్ ఇస్తున్నారు. సభలు, సమావేశాల్లో తమకు అనుకూలమైన వారితో ఫిడ్ బ్యాక్ కుడా తీసుకుంటునట్లు తెలుస్తొంది. ప్రస్తుతం రవిచేస్తున్న ప్రసంగాలు ఆకట్టుకుంటున్నాయని గత రెండు రోజుల నుంచి రవికి ఫిడ్ బ్యాక్ పోవడంతో ఆయన రెట్టించిన ఉత్సహాంతో ముందుకు సాగుతున్నట్లు ఆయన ప్రసంగాలు తెలుపుతున్నాయి. రెండు రోజల క్రితం మాజీ మంత్రి ఫరూక్ ,ఆయన తనయుడు ఫిరోజ్‌లు చేసిన ఆరోపణలకు రవి సరదగా ఇచ్చిన కౌంటర్ వైసిపి కార్యకర్తలలో జోష్ నింపినట్టు తెలుస్తొంది. తన టిక్కెట్ తన జేబిలోనే ఉందని తన ప్రత్యర్థుల టిక్కెట్ వారి జేబిలోకి ఇంకా రాలేదని ఎక్కువ మంది పోటీ పడుతుండడంతో ఎవరి జేబిలేకి వస్తుందో అర్థం కావడం లేదని రవి అన్నప్పుడు కార్యకర్తల నుంచి విపరీతమైన నవ్వుల వర్షం కురిసింది. మా రవన్న టిక్కెట్ ఆయన జేబులోనే ఉందని, మరి నీ టిక్కెట్ ఎవరి జేబిలో ఉందో చెప్పాలని మిమ్మిల్ని అడిగిన వారిని అడగండంటూ రవి మరోసారి అనడంతో కార్యకర్తల్లో జోష్ నింపే యత్నం అద్భుతంగా ఉందని కార్యకర్తలు పేర్కొంటున్నారు. 2004లో రవిచంద్రకిషోర్ రెడ్డి ఆయన ఫ్యాన్స్ ఆలోచన చేస్తున్నది. గెలుపు కాదని మెజార్టీ పై ఉందని ధైర్యం నింపేయత్నంలో రవి ఉన్నారు. అలాగే ప్రత్యర్థులు 2వ స్థానం కోసం ప్రయత్నం చేస్తున్నారని తనపై ఎంతటి విష ప్రచారం చేసిన తనదే విజయం అని రవి ప్రచారంలో ముఖ్యంశాలుగా పేర్కొంటూ అందుబాటులో ఉన్న ప్రతి నాయకుడిని సభలకు ఆహ్వానిస్తూ ముందుకు సాగుతున్నారు.