జానాస్త్రం ప్రతినిధి మారంరెడ్డి జనార్దన్ రెడ్డి
*`అగని దుఃఖం…`*
* ఎవ్వరినీ పలుకరించినా ఏడుపే
* ఫరూక్ ను చూడలేక పోతున్నాం
* బద్ద రాజకీయ శత్రువు లు సైతం…
మంత్రి ఫరూక్ సతీమణి షహనాజ్ మృతి చెంది రెండు రోజులు కావస్తున్నా ఆ కుటుంబంలో దుఃఖం ఆపుకోలేక పోతున్నారని పరామర్శల కువెళ్ళిన వారు అంటున్నారు.
దైర్యం చెప్పడానికి మేము వెళితే వారీ బాధను చూసి మేము ఏడ్చవలసి వస్తుందని కొందరు అంటుండగా… మరి కొంతమంది వారితో పాటు మేము ఏడ్చేసామని చాలామంది అంటున్నారు.
మొత్తం మీద 45 ఏళ్లకు పైగా ఫరూక్ కుటుంబంతో మమేకం కావడమే కాకుండా 5గురు మగ సంతానం,5మంది కోడళ్ళు,వీరి పిల్లలు మరో 10 నీ కలుపుకొని మొత్తం 20 మందికి పైగా ఎవ్వరికి ఎ లోటు లేకుండా చూస్తున్నారు.
దీంతో షహనాజ్ (69) అంటే అందరికి ప్రాణం.అందుకే ఆమె మరణవార్త ను జీర్ణించు కోలేక పోతున్నారు.ఆ కుంటుంబానికి ఆమె లేని లోటు మాత్రం ఉంది.అందువల్ల ఎక్కి..ఎక్కి ఏడువడం తప్ప వారికి మరొమార్గం లేదు.దాదాపు 72 ఏళ్ల వయస్సున్న ఫరూక్ కూడా కంటతడి పెట్టడం మరింత బాధ కలిగిస్తున్నది.
*`అందరికి మంచి మంచి…`*
—————————-
ఫరూక్ అధికారం లో ఉన్న లేక పోయినా అందరినీ అప్యాయంగా పలుకరిస్తారు.అందుకే కులాలకు, మతాలకు,రాజకీయ పార్టీలకు అతీతంగా ఆయనను పరామర్శ చేయడానికి వెళ్తున్నారు.సిఎం చంద్రబాబు నాయుడు తో పాటు మంత్రివర్గ సహచర్లు,ఎంఎల్ఏ,ఎంపీ లు mlc లు పెద్ద సంఖ్యలో వెళ్లి పరామర్శలు చేస్తున్నారు.ఇక పోతే వైసీపీలో టాప్ ఆర్డర్ నాయకులుగంగుల ప్రభాకర్ రెడ్డి,PP నాగిరెడ్డి,మాజీ ఎంఎల్ఏ లు శిల్ప రవి, చక్రపాణి రెడ్డితో పాటు మరికొందరు కూడా వెళ్లి కుటుంబానికి దైర్యం చెప్పి వస్తున్నారు.మొత్తం మీద అందరివాడు ఫరూక్ అని చెప్పడానికి ఇంత కంటే మరో ఉదాహరణ ఏముంటుంది అని నాయకులు అంటున్నారు.ఫరూక్ తో పాటు ఇటీవల అసెంబ్లీ లో కలియ తీరుగుతున్న ఫిరోజ్,ఫయాజ్ లను కూడా నంద్యాల జిల్లా నుంచి జనం పెద్ద సంఖ్యలో వెళ్లి పరామర్శలు చేస్తున్నారు.ఎక్కువ యువకులు వుండడం విశేషం.