♦జనాస్త్రం ప్రతినిది మారంరెడ్డి జనార్ధనరెడ్డి
⇔రంజాన్ వేడుకల్లో కోట్లాది మంది ముస్లీములు
⇔రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందులు
⇔స్వచ్ఛంద సంస్థలు, రాజకీయ పార్టీలు కుడా …
⇔జకాత్ అధిక ప్రాధాన్యత
ప్రపంచ వ్యాప్తంగా రంజాన్ పండుగను ముస్లింలు కోట్లలో నిర్వహిస్తున్నారు. ముస్లీంలు అత్యంత పవిత్రంగా భావించే ఈ పండుగను ఎంతో నిష్టతో పురుషులు, మహిళలు చేస్తారు. మూడుపూటల నమాజ్ చేసుకుంటూ తమ వృత్తిని కొనసాగించుకుంటూ నిజాయితీగా కొనసాగుతారు. మార్చి 12వ తేది నుంచి ఈ పండుగ ఆరంభమై ఏఫ్రిల్ 10వ తేదిన ముగిసే అవకాశం ఉంది. పండగలో నమాజ్‌తో పాటు జాకాత్ అనే అంశాన్ని కుడా ముస్లింలు ఆచరిస్తారు. జకాత్ చేస్తేనే నమాజ్‌కు గౌరవం అని వారు భావిస్తారు. జకాత్ అంటే తన సంపాదనలో రెండు నర్ర శాతం పేద ప్రజలకు, దార్మిక కార్యక్రమాలకు ఖర్చు చేస్తుంటారు. ఈ జకాత్‌ను ఏదోఒక రూపంలో సంవత్సరంలో ఆర్థికంగా స్థితిమంతులైన ముస్లింలు అమలు చేస్తుంటారు. రంజాన్ నుంచి రంజాన్‌కు ఏడాదిగా గడువు పెట్టుకొని ఈ జకాత్‌ను పూర్తి చేస్తారు. ఖురాన్‌లో దీనిని ప్రత్యేకంగా పేర్కొనడంతో ప్రతి ఉన్నతమైన ముస్లింలు కుటుంబం అమలు చేయడానికి ప్రయత్నాలు చేస్తుంటారు. వీరికి రంజాన్ పండుగ సందర్భంగా రంజాన్ ప్రధాన్యతను వివరించే మత పెద్దలు అన్ని అంశాలను వివరిస్తూ దీనిని కుడా చెబుతుంటారు. రంజాన్ మాసంలో శక్రవారాలకు అధిక ప్రాధాన్యత ఉంటుంది. ఇప్పటి వరకు రెండు శుక్రవారాలు ముగియగా మార్చి 29వ తేది, ఏఫ్రిల్ 5వ తేది చివరి శుక్రవారాలుగా పేర్కొనవచ్చు. వీటితో పాటు రంజాన్ ఆరంభం నుంచి ముగింపు వరకు 4:30 గంటల తరువాత ఇమాములు నిర్ణయించిన సమయాల్లో సహేరి, ఇఫ్తార్ విందులు కుడా జరుగుతాయి. కొన్ని మసీదుల దగ్గర స్వచ్ఛంద సంస్థ సహకారంతో ముస్లింలు ఇఫ్తార్ విందును ఇస్తున్నారు. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో రాజకీయ పార్టీలు కుడా ముస్లీం, హిందువులు భాయి, భాయి అంటూ ఐక్యమత్యం చాటుకునే విధంగా ఇఫ్తార్ విందును ఇస్తున్నారు. గత కొన్ని సంవత్సరాల నుంచి రాష్ట్ర ప్రభుత్వాలు కుడా ఇఫ్తార్ విందును అధికారికంగా నిర్వహిస్తూ ఆ ప్రాంతంలోని ముస్లీం పెద్దలను ఆహ్వానించి విందును ఏర్పాటు చేయడం మంచి పరిణామంగా పేర్కొంటున్నారు.