*జనాస్త్రం ప్రతినిది మారంరెడ్డిజనార్ధనరెడ్డి
* నో డౌట్ ఉయ్యాలవాడ నే
* ఉయ్యాలవాడ వర్ధంతిలో ఎం.ఎల్.ఏ అమర్ నాథ్ రెడ్డి
* కడప పట్టణం లో వీర సింహం విగ్రహం ఏర్పాటు కు కృషి
* ఇద్దరు నంద్యాల రిపోర్టర్ లకు సన్మానం
* కర్నాటి మహీధర్ కు సన్మానం
* రిపోర్టర్ ఫణి రచనలను ఉచితంగా పంపిణీ
కుట్రలు,కుతంత్రాలు ఎదుర్కొని కొద్దిరోజుల్లో తొలి స్వతంత్ర సమర యోధుడు గా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గుర్తింపు పొందడం గ్యారెంటీ అని నంద్యాలకు చెందిన సీనియర్ పాత్రికేయుడు మారం రెడ్డి జనార్ధన రెడ్డి పేర్కొన్నారు.శని వారం కడప పట్టణం లోని వైఎస్ఆర్ ప్రెస్ క్లబ్ లో నరసింహ రెడ్డి 178 వర్ధంతి ని నిర్వహించారు.ఈ సమావేశానికి రాజంపేట ఎంఎల్ఏ అకేపాటి అమర్ నాథ్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.కడప పట్టణం కు చెందిన సాక్షి బ్యూరో బాలకృష్ణ రెడ్డి,మాజీ మేయర్ హిమబిందు,కమ్యూనిస్టు నాయకుడు రవి,నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ప్రముఖ పాత్రికేయుడు కాసిపురం ప్రభాకర్ రెడ్డి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పుట్టుక నుంచి బ్రిటిష్ అధికారుల చేతుల్లో ఉరి జరిగే వరకు ఆధారాలతో వివరించారు.ఆయన తొలి స్వతంత్ర సమర యోధుడు అన్నదానికి ఎన్నో ఆధారాలు ఉన్నాయని అన్నారు.సై ..సై నరసింహ రెడ్డి సినిమా కోసం తాను చేసిన ప్రయత్నాలను ప్రభాకర్ రెడ్డి వివరించారు.
* ముగ్గురికి సన్మానం
ఎంఎల్ఏ అమర్ నాథ్ రెడ్డి తో పాటు నంద్యాల జిల్లా కు చెందిన సీనియర్ పాత్రికేయుడు మారం రెడ్డి జనార్ధన రెడ్డి,కాసిపురం ప్రభాకర్ రెడ్డి,నరసింహ రెడ్డి వారసుడు అయిన కర్నాటి ప్రభాకర్ రెడ్డి తనయుడు మహీధర రెడ్డి (రూపనగుడి) లను సన్మానించారు. ఉయ్యలవాడ నరసింహ రెడ్డి విగ్రహం కడప పట్టణం లో ఏర్పాటుకు అందరూ సహకరించాలని ముక్త కంఠం తో హామీ ఇచ్చారు.అంచనాలకు మించి జనాలు వచ్చారు దీంతో సమావేశ నిర్వాహకులు సాక్షి కడప రిపోర్టర్ ఫణి తదితరులు సంతోషాన్ని కలిగించింది అని అన్నారు.. ఫణి రచన చేసిన బుడ్డ వెంగళ రెడ్డి,ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పుస్తకాలను పెద్ద సంఖ్యలో ఉచితంగా అందజేశారు