♦జనాస్త్రం ప్రతినిది మారంరెడ్డి జనార్ధనరెడ్డి
♣ ఎంపీ రేసులో బెజ్జం పార్థసారధి రెడ్డి
♣ డోన్ అసెంబ్లీ నుంచి కుడా ట్రై
నంద్యాల పార్లమెంట్ నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా బిజ్జం పార్థసారధి రెడ్డి రేసులో ఉన్నట్లు తెలిసింది. బనగానపల్లె నియోజకర్గంలోని అవుకు మండలంకు చెందిన పార్థసారధి రెడ్డి గతంలో పాణ్యం నియోజకవర్గ ఎమ్మెల్యేగా కొనసాగారు…గత 2, 3 దఫాలుగా జరిగిన ఎన్నికల్లో దూరంముంటూ వస్తున్నారు. గతంలో పార్థుడు తండ్రి బెజ్జం సత్యనారాయణ రెడ్డి ప్రస్తుతం పాణ్యం, బనగానపల్లె ఎమ్మెల్యేలుగా ఉన్న రామిరెడ్డి, రాంభూపాల్ రెడ్డిలతో ఫ్యాక్షన్ చేసి, ఇరు వర్గాలు పెద్ద సంఖ్యలో అనుచరులను పోగొట్టుకున్నారు. ఆ తరువాత ఇరువురు ఫ్యాక్షన్‌కు దూరం అయ్యారు. కానీ రాజకీయంగా శత్రువులుగానే కొనసాగుతున్నారు. రాజకీయ విశ్రాంతి నుంచి బెజ్జం ఈసారి నంద్యాల పార్లమెంట్ నుంచి పోటీ చేస్తే ఎలా ఉంటుందనే అంశం చర్చలు సాగుతున్నాయి. డోన్ అసెంబ్లీ నుంచి పోటీ చేయమని కుడా పలువురు సలహాలు ఇస్తునట్లు సమాచారం. మొత్తం మీద రాష్ట్ర స్థాయిలో రాజకీయంగా భారీ పరిచయాలు ఉన్న బిజ్జం ఈసారి ఎమ్మెల్యేగా గానీ, ఎంపీగా గానీ పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని ఆయన అనుచరులు అంటున్నారు.