♦జనాస్త్రం ప్రతినిది మారంరెడ్డి జనార్ధనరెడ్డి
⇒ కాంగ్రెస్ రేసులో రాంపల్లె రఘు
⇔ పోటీకి నాకేం తక్కువ
ఆళ్లగడ్డ అసెంబ్లీ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయడానికి అవకాశం ఇస్తే తాను పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని సీనియర్ రాజకీయ నాయకుడు రాంపల్లె రఘునాథ్ రెడ్డి అన్నారు. మంగళవారం నంద్యాల పట్టణంలో జనాస్త్రంతో మాట్లాడుతూ అనేక సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీ లో భూమా నాగిరెడ్డి, శోభానాగిరెడ్డి విజయాల కోసం కృషి చేశానని 2019లో టిడిపి అభ్యర్థిగా పోటీ చేసిన మాజీ మంత్రి అఖిల ప్రియ తరఫున ప్రచారం నిర్వహించామన్నారు. కొద్ది మాసాల క్రితం ఆళ్లగడ్డ వైయస్ఆర్సిపి నాయకుల సమక్షంలో వైయస్ఆర్సిపిలో చేరాన్నారు. 40 సంవత్సరాల పాటు నియోజకవర్గంలోని తన సొంత మండలమైన చాగలమర్రి, ఆళ్లగడ్డ, రుద్రవరం, శిరివెళ్ల, ఉయ్యలవాడ, దొర్నిపాడు మండలాల్లో ప్రధాన నాయకులతో పరిచయాలు ఉన్నాయని ఆయన తెలిపారు. తనకంటే అనుభవం లేని నాయకులు ఏంతో మంది ఎమ్మెల్యే బరీలో దిగాలని చూస్తున్నారని వారితో పొలిస్తే తనకు అన్ని అర్హతలు ఉన్నాయని రఘునాథ్ రెడ్డి తెలిపారు. మండల అధ్యక్షుడిగానూ, సింగిల్ విండో ఛైర్మన్‌గానూ, రాంపల్లె సర్పంచ్ గానూ పని చేసిన అనుభవం ఉందని వివరించారు. కాంగ్రెస్ పార్టీ ఆళ్లగడ్డ నియోజకర్గ అభ్యర్థులను పరిశీలించే సమయంలో తన పేరును పరిశీలనలోకి తీసుకోవాలని అన్నారు.