జనాస్త్రo ప్రతినిధి..మారం రెడ్డి జనార్దన రెడ్డి
# కాటసాని.. భయపడే ఆ ఇద్దరు ఎవరూ..
#నాపై నక్కజిల్లులు పనిచేయవు..
# నా ఓటర్లే నా ప్రాణం..
మూడు నెలల ముందు విష ప్రచారం.. ఆ తర్వాత మటుమాయం..
నేను భయపడేది.. తలవంచేది ఇద్దరికి మాత్రమేనని పైనున్న దేవుడు.. భూమ్మీదున్న పాణ్యం నియోజకవర్గ ఓటర్లకు మాత్రమేనని నంద్యాల జిల్లా పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి అన్నారు. సోమవారం కర్నూలు పట్టణంలో ఆయన తనను కలిసిన అభిమానులు, ప్రజలతో మాట్లాడుతూ పాణ్యం నియోజకవర్గంలో తనకున్న బలమోమిటో తెలుసుకున్న వారు తనను ఏదో ఒక విధంగా దెబ్బతీయాలని ప్రయత్నం చేస్తున్నారని వాటికి భయపడనన్నారు. ఇలాంటి నక్కజిత్తులతో కుట్రలతో నన్ను దెబ్బతీయలేరని నేను ప్రజలకు చేసే సేవలు గ్రామాల్లో చేసే అభివృద్ధి పనులు నాకు శ్రీరామ రక్షగా నిలుస్తాయని ఇప్పటికైనా గ్రహించి సోషల్ మీడియాను, ఇతర మీడియాలను అడ్డం పెట్టుకొని నన్ను దెబ్బతీయాలని ప్రయత్నం చేసే వారు వారే చిత్తు అవుతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత కొద్ది రోజుల నుండి తనపై విచిత్ర పద్దతులతో దుష్పప్రచారం చేస్తున్నారన్నారు. ఇవన్నీ నాకు కొత్త కాదని ప్రతి ఎన్నికల్లో పోలింగ్‌కు మూడు నెలల ముందు తన ప్రత్యర్థులు ఇలాంటి నక్కజిత్తుల ఎత్తులను వేయడం సహజమేనని ఆ తర్వాత ప్రజలిచ్చే మెజార్టీతో నాలుగున్నర్ర సంవత్సరాల పాటు మటుమాయం అవుతారని అన్నారు. నా నియోజకవర్గంలోని పాణ్యం, ఓర్వకల్లు, గడివేముల, కల్లూరు మండలాల్లోని ఓటర్లకు తన వంతు సహాయం చేస్తుంటానని ప్రజలకు ఎక్కడ అన్యాయం చేయలేదన్నారు. అంతేకాక తాను అక్కడ ఆక్రమించుకున్నాను.. ఇక్కడ ఆక్రమించుకున్నాను అని ప్రచారం చేస్తున్నారని ఆధారాలతో వస్తే తానుసమాధానం ఏ టైంలోనైనా చెప్పడానికి సిసద్ధంగా ఉన్నానన్నారు. నేను చేసిన ఎన్నో అభివృద్ధి పనులను బయటకు చెప్పలేని వారు తన గురించి అవాకులు.. చెవాకులు మాట్లాడే అర్హత లేదన్నారు. రాష్ట్రంలో వైసీపీకి అన్ని నియోజకవర్గాల్లో ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని అందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 24 గంటలు పనిచేయడమేనన్నారు. నాకు పాణ్యం టికెట్ రాదని కొందరు… నంద్యాల పార్లమెంటుకు పోటీచేయమని మరి కొందరు… బనగానపల్లె అసెంబ్లీ నుండి పోటీ చేస్తారని ఇంకొందరు కుట్రలు కుతంత్రాలు పడుతున్నారని ఇటువంటి వాటికి తాను బెదరనని నన్ను మారమని నాకు ఎవరూ చెప్పలేదన్నారు. నా నియోజకవర్గంలో జరిగే అభివృద్ధి పనులను చర్చించడానికి సీఎం దగ్గరకు, సీఎంఓ కార్యాలయానికి వెళుతుంటానని ఇదే ఆసరాగా చేసుకొని నేను నియోజకవర్గాలు మారుతున్నట్లు ప్రచారం చేయడం తగదన్నారు. విలేకరులు వార్తలు రాయడం వారి ధర్మమని అయితే వాస్తవాలు రాస్తే బాగుంటుందని లేకుంటే వారి విజ్ఞతకే వదిలేస్తున్నానని తనను కలిసిన అభిమానులకు, ప్రజలకు కాటసాని వివరించారు.