♦జనాస్త్రం ప్రతినిది మారంరెడ్డి జనార్ధన రెడ్డి
⇒వారిని పట్టించుకోకుంటే మహా ప్రమాదం
⇔పేద కార్యకర్తలకు సహాయం చెయ్యాలి
⇔పదవులు కూడాఇస్తామని చెప్పి జోష్ నింపాలి
⇔సీనియర్లకు,పార్టీని నమ్ముకున్న వారికి అన్యాయం జరగొద్దు
⇔వైయస్ ఆర్ సిపి, టిడిపి, తోపాటు అన్నీ పార్టీలలోను ఇదే ఆలోచన
రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాలలో ప్రత్యర్ధులను తమ వైపు తిప్పుకుని కండువాలు వేయడంలో ఉత్సాహం చూపుతున్న వైయస్ ఆర్ సిపి, తెలుగుదేశం, బిజెపి, కాంగ్రెస్ తోపాటు ఇతర పార్టీల నాయకులు ఆతరువాత వారిపై కన్నెత్తి చూడడంలేదనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి..ఒక పార్టీలో ఉన్న కార్యకర్తలను,నాయకులను చేర్చుకునే ముందర ఎంత ఉత్సాహం చూపుతారో ఆతరువాత పట్టించుకోకుంటే ప్రమాదం కూడా అంతే ఉంటుందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు..
1.చేర్చుకునే ముందే ముందున్న నాయకులతో చర్చలు జరిపి వారు మనస్పూర్తిగా అంగీకరిస్తేనే చేర్చుకోవాలి..లేనిపక్షంలో ఇరువురు వీది పోరాటాలకు దిగి పార్టీగాని అభ్యర్ధిగాని అవమానం చెందే పరిస్థితి ఉంటుంది..
2.కండువా వేసుకున్న తరువాత గ్రామంలో, టౌన్ లో జరిగే కార్యక్రమాలలో జంపింగ్ వీరులు వచ్చారా..లేదా,, అని తెలుసుకోవాలి
3.వారికి కండువా వేసామని వారే వస్తారులే అనుకోవడం పొరపాటు ..నాపనికూడా ఉందన్న విషయం మనం కూడా గమనించాలి
4.పార్టీలో ఏళ్ల తరబడి కొనసాగుతున్న నాయకులకు పదవులు హామీ ఇవ్వకపోవడం ముమ్మాటికి తప్పే అవుతుంది..కొత్తగా చేరినవారికి అరచేతిలో వైకుంఠం చూపితే పాతవారు అలిగే ప్రమాదం ఉంది..అసలుకు ముప్పు వచ్చినా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు..
5.కొత్తగా పార్టీలో చేరినవారికి భారీ ఎత్తున కోట్లల్లో పారితోషికాలు ఇస్తున్నట్లు ఆరోపణలు వస్తుంటాయి..ఈ విషయాన్ని సీనియర్లు గమనిస్తుంటారు..వారికి కూడా ప్రచార ఖర్చులకు ఇస్తే సంతోషిస్తారు..ఒకరిని ఆకాశంలోకి ఎత్తుతూ అదే పార్టీలో సీనియర్లను అద..పాతాళానికి తొక్కే సాంప్రదాయానికి దూరం అయితే అభ్యర్దికి మేలు జరుగుతుంది..వీటిని గమనించమని జనాస్త్రం అభ్యర్దులను,నాయకులను కోరుతున్నది..