♦జనాస్త్రం ప్రతినిది మారంరెడ్డి జనార్ధనరెడ్డి
⇔23 నుంచి భూమా బ్రహ్మాస్త్రం
⇔42 వార్డులలో భూమా పాదయాత్ర
⇔హైకంమండ్ దృష్టికి పాదయాత్ర
నంద్యాల టిడిపి మాజీ ఎమ్మెల్యే, మాజీ ఇన్‌ఛార్జి భూమా బ్రహ్మానందరెడ్డి తెలుగుదేశం పార్టీ పై బ్రహ్మస్త్రం సందించనున్నారా అనే చర్చ జరుగుతున్నది. గత అసెంబ్లీ ఎన్నికల్లో రెండు దఫాలుగా పోటీ చేసిన భూమా బ్రహ్మానందరెడ్డిని ఈసారి తప్పించి అసెంబ్లీకి 20 ఏళ్ల నుంచి దూరంగా ఉన్న మాజీ మంత్రి ఫరూక్‌ను మైనార్టీ కోటాలో తెర పైకి తెచ్చారు. దీనిని భూమా జీర్ణించుకోలేకపోతున్నారు. ఫరూక్ మాత్రం కలిసి చేసుకుందామని భూమాను అడిగిన ఆయన నుంచి సానూకులమైనా సమాధానం రాలేదు. పార్టీ అధిష్టాన వర్గం మాత్రం రెండు నాలుకల ధోరణితో వ్యవహరిస్తున్నది. పార్టీ అగ్రనేతలు మాత్రం ఇరువురికి నీకే టిక్కెట్… నీవే పార్టీని బలోపేతం చేయాలని ఆదేశిస్తున్నారు. దీంతో ఫరూక్‌తో పోటీగా భూమా కుడా నంద్యాల అసెంబ్లీ, నియోజకవర్గంలో పర్యటనలు సాగిస్తున్నారు. ఈనెల 23వ తేది శుక్రవారం సాయంత్రం నుంచి నంద్యాల పట్టణంలో పాదయాత్ర చేయాలని ముహుర్తం నిర్ణయించుకున్నారు. దివంగత భూమా నాగిరెడ్డికి సెంటిమెంటైన జగజ్జనని దేవాలయం వైపు నుంచి కార్యక్రమాలు ఆరంభించే సాంప్రదాయం ఉంది. ఇదే సాంప్రదాయాన్ని దేవుడి మూలగా గుర్తింపు పొందిన ఈ ప్రాంతం నుంచి యాత్రను ఆరంభించాలని నిర్ణయించుకున్నారు. తెలుగుదేశం పార్టీని బలోపేతం చేసే కార్యక్రమాల్లో భాగంగా ఈ యాత్రను ఆరంభిస్తున్నట్లు పార్టీ అగ్రనేతలకు సమాచారంను భూమా అందించినట్లు తెలుస్తొంది. అయితే పార్టీ ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తుందా, వ్యతిరేఖిస్తుందా అనే అంశం పై చర్చలు సాగుతున్నాయి. ఇప్పుడు ఫైనల్ సర్వే సాగుతున్నదని ఇదే అదునుగా పట్టణంలో పాదయాత్రను నిర్వహిస్తే పార్టీ కుడా ఒక నిర్ణయానికి వేగంగా వచ్చే అవకాశం ఉందని బ్రహ్మాం అంచనా. కొద్ది మాసాల క్రితమే నమస్తే నంద్యాల పేరుతో 42 వార్డులలో, ఆ తరువాత గ్రామాల్లో ఈ యాత్రను నిర్వహించాలని ముహుర్తాలు కుడా నిర్ణయించుకున్నారు. వివిధ కారణాలతో వాయిదా పడినప్పటికి, 23వ తేది నుంచి యాత్రను జరిపి తనకున్న జనబలం మేమిటో నిరూపించుకునే యత్నంలో ఉన్నారు. ఒకరకంగా ఇది పార్టీ పై బ్రహ్మాం విసిరే అస్త్రంగా కుడా చర్చించుకుంటున్నారు.