♦జనాస్త్రం ప్రతినిది మారంెడ్డి జనార్ధనరెడ్డి
♦రాయలసీమ నూతన విసికి నంద్యాల ఘన స్వాగతం
♦ఉపాదే ధ్యేయంగా విద్యా భోధన
♦అన్ని సమస్యలు పరిష్కరిస్తూ ముందుకు పోతా
రాయలసీమ యూనివర్సీటి పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేట్ అటానమస్ కళాశాలలో చదువుతున్న డిగ్రీ, పిజి విద్యార్థులందరికి అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యను అందించడమే ప్రధాన లక్ష్యమని నూతన విసిగా బాధ్యతలు స్వీకరించిన బి.సుధీర్ ప్రేమ్ కుమార్ విలేకరులకు తెలిపారు. మంగళవారం నంద్యాల జిల్లా కేంద్రంలోని రామకృష్ణా పిజి, డిగ్రీ కళాశాల ఛైర్మన్ రామకృష్ణా రెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన భారీ కంప్యూటర్ల కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో, పాత్రికేయులతో మాట్లాడుతూ ప్రభుత్వం విద్యార్థులను ఈ రాష్ట్రానికి, దేశానికి పరిమితం చేయవద్దని నిర్ణయించినట్లు తెలిపారు. అంతర్జాతీయ స్థాయిలో మన విద్యార్థులు విజయం సాధించడానికి కళాశాలలో విద్యా భోధన, నైపుణ్యం పెరిగే విధంగా ప్రణాళికలను రూపొందిచడమే కాకుండా అమలు కుడా చేస్తున్నామని అన్నారు. విద్యార్థులకు అవసరమైన వసతులను కల్పించడానికి అధిక ప్రాధన్యత ఇస్తామని అన్నారు. యూనివర్సీటి కేంద్రంలోనే కాకుండా పరిధిలోని కళాశాలలో విద్యార్థులకు అవసరమైనా ఏ కార్యక్రమం చేపట్టిన తాము అంగీకరిస్తామని అన్నారు. కేవలం విద్యా భోధనే ప్రధాన అంశంగా తీసుకున్న క్రీడలు, ఉపాధి, కమ్యూనికేషన్ స్కిల్స్ తదితర వాటిని కుడా విద్యార్థుల దగ్గరికి చేర్చుతామని విసి అన్నారు. ఇంజనీరింగ్‌లోని వివిధ విభాగాల్లో మరింత శక్తి యుక్తులు ప్రదర్శించే విధంగా చూస్తామన్నారు. రామకృష్ణా విద్యా సంస్థల ఛైర్మన్ గడ్డం రామకృష్ణా రెడ్డి మాట్లాడుతూ పరిశోధనల మీద విద్యార్థుల దృష్టిని సారించే విధంగా చర్యలు తీసుకోవాలని విసిని కోరారు. తమ కళాశాలలో 1990 నుంచే విద్యార్థులకు ఉపాధి చూపే విధంగా విద్యాను ఆరంభించామని తమ కళాశాలలో ఎంసిఏను ప్రారంభించామని అప్పటికి తమ కళాశాల పరిధిలోకి వచ్చే అనంతపురం ఎస్‌కె యూనివర్సీటిలో ఈ సబ్జెక్ట్ లేదన్నారు. ఇలాగే మరికొన్ని సబ్జెక్టు కుడా ప్రవేశ పెట్టామని అన్నారు. తమ కళాశాల విద్యాతో పాటు ఎన్నో రంగాలకు ప్రాధన్యత ఇస్తున్నదని దేశియ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన క్రీడాకారులు ఉన్నారన్నారు. పండుగ వాతావరణంలో జరిగిన ఈ కార్యక్రమంలో వైస్ ఛాన్సలర్‌ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో విజయ కుమారి, ప్రగతి రెడ్డి, కుమార్, వెంకటరావు, సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు.