జనాస్ట్రం ప్రతినిధి మారంరెడ్డి జనార్ధన్ రెడ్డి
నంద్యాల నుంచి జనసేనాని పవన్
సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నంద్యాల అసెంబ్లీకి పోటీ చేసే అవకాశాలు లేకపోలేదని జనసేన నాయకులు అంచన వేస్తున్నారు. పవన్ కళ్యాణ్ సర్కార్ ప్రాంతంలో పాటు రాయలసీమ నుంచి కుడా పోటీ చేసే అవకాశం ఉంది. అయితే ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారనే దాని పై జోరుగా చర్చలు జరుగుతున్నాయి. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అయితే తిరుపతి, అనంతపురం జిల్లా అయితే అనంతపురం, కర్నూలు జిల్లాలో అయితే నంద్యాల నుంచి పోటీ చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయని రాజకీయ పరిశీలకులు అంచన వేస్తున్నారు. నంద్యాల పై ఆయన వ్యక్తి గతంగా, పార్టీ పరంగా సర్వే చేయించుకునట్లు సమాచారం. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కుడా స్థానికంగా అధికంగా ఉండడమే కాకుండా ఆయన నటించిన చిత్రాలకు వారం, పది రోజులు కలెక్షన్లు ఉండడంతో నంద్యాల నుంచి పోటీ చేయడం బెట్టర్ అనే నిర్ణయానికి ప్రాధమికంగా వచ్చినట్లు తెలుస్తోంది. అంతేకాక పొత్తుల పై జనసేన ఎక్కడి నుంచి పోటీ చేస్తుందన్న అంశం పై చంద్రబాబుతో చర్చలు జరిగినప్పుడు నంద్యాల కుడా తమకు కేటాయించాలని పవన్ కళ్యాణ్ కోరినట్లు సమాచారం. 2004 నుంచి 2019 వరకు జరిగిన నాలుగు సాధరణ ఎన్నికల్లో వైసిపి విజయం సాధించింది. 2014-19 మధ్యన జరిగిన ఉపఎన్నికల్లో మాత్రమే టిడిపి విజయం సాధించింది. దీంతో చంద్రబాబు నాయుడు గట్టిగా పోరాటం జరిపితే తప్ప తమకు అనూకులంగా ఉండదని అంతేకాక తెలుగుదేశంలో స్థానిక నాయకుల మధ్య ఉన్న విబేదాలను పరిష్కరించడం సాధ్యం కాదనే భావానకు వచ్చినట్లు తెలుస్తొంది.పవన్ కళ్యాణ్‌కు అనూకూలీంచే అంశాలలో పెద్ద సంఖ్యలో తన సామాజక వర్గానికి చెందిన ఓటర్లు ఉండడం అన్ని కులాలలో తన ఫ్యాన్స్ ఉండడం కలిసి వచ్చే అంశంగా భావిస్తునట్లు తెలుస్తొంది. స్థానిక జనసేన కార్యకర్తలు కుడా ఆయనను కలిసినప్పుడు పిఆర్పి పోటీ చేసిన సమయం వేరని ఇప్పుడు వేరని విజయావకాశలు జనసేనకు మెండుగా ఉన్నాయని పవన్ కళ్యాణ్‌కు చెప్పినట్లు సమాచారం.