జనాస్త్రం ప్రతినిది మారంరెడ్డి జనార్ధనరెడ్డి
రాష్ట్రం లోని ప్రముఖ దేవాలయాలకు ప్రతి ఏటా దాదాపు రూ20 లక్షల కు విలువచేసే కూరగాయలు అందిస్తున్న మార్కెట్ ప్రసాద్ కు అహోబిలం మఠం నుండి అరుదైన ఆహ్వానం అందించారు… నంద్యాల పట్టణం లో ను చుట్టూ ప్రక్కల ప్రాంతాల్లోనీ ప్రజలకు సాధారణ ధరలకు కూరగాయలు అందిస్తు అందులో వచ్చిన ఆదాయం ను రాష్ట్రం లోని ప్రముఖ దేవాలయాలకు ఉచితంగా కూరగాయలను అందిస్తారు..ఈ మొత్తం రూ 20 లక్షల కు పైగా ఉంటుందని అంచనా..ఐతే గత ఏడాది కి ప్రముఖ పండుగలకు ఉచితంగా కూరగాయలను అహోబిలం కు అందజేసే ప్రసాద్ కుటుంబ సభ్యులు గత ఏడాది నుంచి అహోబిల దేవస్తానం లో జరిగే నిత్య అన్నదానం కు ఉచితం గా కూరగాయలు అందిస్తున్నరు..దీంతో అహోబిల మఠం పీఠాధిపతి ప్రశంసిస్తూ అహోబిలం లో జరిగే ప్రతి ప్రధాన కార్యక్రమానికి హాజరుకావలని ఆహ్వానం అందించాలని మఠం సిబ్బందికి ఆదేశించారు..అందులో భాగంగా 2025 అక్టోబర్ 02 నుంచి వారం కు పైగా జరిగే పవిత్రోత్సవాలు కు దేవాలయం ప్రముఖ పూజారి స్వామినాథన్ ద్వారా ఇంటికి వెళ్లి ఆహ్వానం ను అందించారు.. ఇటు వంటి ఆహ్వానం కొద్ది మందికే మఠం ఇస్తుంది..అందులో మార్కెట్ ప్రసాద్ ఒకరు.. ఆహ్వానం అందుకున్న ప్రసాద్ కుటుంబ సభ్యులు శ్రీ నరసింహ స్వామి ఆశీస్సులు పుష్కలంగా ఉన్నంత కాలం అహోబిలం కు ఉచితంగా కూరగాయలను అందిస్తామని చెప్పారు…