♦జనాస్త్రం ప్రతినిది మారంరెడ్డి జనార్ధనరెడ్డి
⇔ఎన్నికల సంఘం అభ్యర్థులకు షాక్
⇔నంద్యాల ఎంపీ పరిధిలో అభ్యర్థులకు రూ.20 కోట్లు అదనపు ఖర్చు
⇔బెంబెలెత్తుతున్న అభ్యర్థులు
⇔సంకలు గుద్దుకుంటున్న అభిమానులు
⇔ప్రజల్లోకి మరోసారి వెళ్లమని ఆదేశించిన నేతలు
రాష్ట్రంలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు నాలుగవ ఫేస్‌లో నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయించడంతో ఒక నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గంలోని ఇరు పార్టీల అభ్యర్థులకు కనీసం రూ.14 కోట్ల నుంచి 20 కోట్ల వరకు అదనంగా వ్యయం అవుతుందని అంచన వేస్తున్నారు. మొదటి దశలో ఏఫ్రిల్ 19వ తేదిన ఎన్నికలు జరగవచ్చునని భావిస్తున్న అభ్యర్థులకు ఎన్నికల సంఘం భారీ ఎత్తున షాక్ ఇచ్చింది. కనీసం 2వ దఫాలోనైనా రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించి ఉంటే తమకు ఎంతో మేలు జరిగేదని ఒకేసారి మూడు వారాలు అదనంగా రావడంతో పరిస్థితి దారుణంగా ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నాలుగవ విడుత మే 13వ తేది దేశ వ్యాప్తంగా 96 పార్లమెంట్ స్థానాలతో పాటు ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు 175 నియోజకవర్గాల్లో ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికలు సంఘం నిర్ణయించింది. రియల్ ఎస్టేట్‌తో పాటు భారీ వ్యాపారాలు చేసే వారికి కుడా ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయం ఆయసగా ఉందని అంటున్నారు. ఇక సాధారణ వ్యాపారాలతో ఉన్న స్థలాలు, పొలాలు అమ్మి బరీలోకి దిగే అభ్యర్థులు 4వ విడుతను ఫేస్ చేయడం సాధ్యం కాదని అంటున్నారు. వైసిపి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాత్రం మంచి అవకాశం దొరికిందని ఓడిపోయే అభ్యర్థులు గెలువడానికి, సాధారణ మెజార్టీతో గెలుపొందే వారు భారీ మెజార్టీతో గెలుపొందే అవకాశం ఉందని అందువల్ల ప్రతి ఇంటిని మరోసారి పలకరించి రావాలని ఆదేశిస్తున్నారు. ఇక జగన్ మోహన్ రెడ్డి అయితే బస్సు యాత్రను ఆరంభిస్తున్నారని ఈనెల 28వ తేదిన నంద్యాల పార్లమెంట్‌కు వస్తున్నారని అందువల్ల నంద్యాల, ఆళ్లగడ్డ, బనగానపల్లె, డోన్, పాణ్యం, శ్రీశైలం, నందికొట్కూర్ నియోజకవర్గ ప్రజలను భారీ ఎత్తున తరలించాలని నిర్ణయించారు. ఆ తరువాత చంద్రబాబు కుడా రథ యాత్రను నిర్వహిస్తారని ఇలా ఒక్కొక అగ్రనేత సభకు ఒక్కొక నియోజకవర్గం నుంచి రూ.70 లక్షల నుంచి రూ.కోటి వరకు వ్యయం అవుతుందని అంచన వేస్తున్నారు. ఇప్పటికే ఒక్కొక నియోజకవర్గం అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేసే వారికి ఒక్కొక పార్టీ తరపున కనీసం కోటి రూపాయల చొప్పున రెండు పార్టీల వారు రెండు కోట్లు వ్యయం చేశారని భావిస్తున్నారు. మొత్తం మీద అభ్యర్థులు శనగలు పండించి సంపాదించింది ఏమి లేదు అని బిదవాళ్లలో కొందరికి నిత్యం ఉపాధి కలుగుతున్నదని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మందు ప్రియులు సైతం వేసవి దాహం తట్టుకోవడానికి మద్యంను తీసుకోవాల్సి వస్తున్నదని దీనిని అభ్యర్థే భరించాల్సి వస్తున్నది. మొత్తం మీద ఎన్నికలు నాలుగవ విడుతలో జరగడం ఎవరికి మింగుడు పడడం లేదు.