జనాస్త్రం ప్రతినిది మారంరెడ్డి జనార్దనరెడ్డి
* ప్రశాంత దర్శనాలకోసం యమ్.ఎల్.ఎ బుడ్డా, కలెక్టర్, యస్.పి లు చర్చలు…
*35 లక్షల లడ్లు తయారీ….
* శివ భక్తులకు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు..
శ్రీశైలం బ్రహ్మోత్సవాలను తిలకించడానికి మేము సిద్దంగా ఉన్నామని మీరుకూడా రెడీగా ఉండాలని భక్తులు అదికారులను కోరుతున్నారు.యమ్.ఎల్.ఎ. బుడ్డా రాజశేఖర్ రెడ్డి, జిల్లా కలెక్టర్, జిల్లా యస్.పి. తో పాటు పలు శాఖల అదికారులు ఎప్పటికప్పుడు ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. ఈ నెల 23 వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించే అవకాశం ఉంది.ఆరోజే ఎండోమెంట్ మంత్రి ఆనం నారాయణ రెడ్డి, జిల్లా మంత్రి జనార్ధన్ రెడ్డితో పాటు మరికొంత మంది మంత్రులు, నంద్యాల యం.పి. భైరెడ్డి శభరి తదితరులు పాల్గోంటారని అదికారులు అంటున్నారు..
* బ్రహ్మోత్సవ తేదీలు ఫిబ్రవరి 19 తేదీ నుంచి మార్చి 1 వ తేదీ వరకు…
* శ్రీశైలంకు వచ్చే బస్సులు 450 కి పైగా …
* ఉచ్చిత లడ్లు ఫిబ్రవరి 27 వరకు 4లక్షల మందికి 50 గ్రా౹౹ల లడ్డు…
* ఉత్సవాలు ముగిసేవరకు అటవి టోల్ గేట్లు ఫ్రీ…
* 35 లక్షల లడ్డు ప్రసాదము సిద్దం….
* 100 గ్రాముల లడ్డు రూ. 20 లు మాత్రమే…
* శివ భక్తులకు ఫిబ్రవరి 19 నుంచి 23 వరకు స్పర్శదర్శనం..
* దర్శనం సందర్బంగా శివ భక్తులకు ఆల్ఫాహారం, సాంబారు అన్నం , స్వీట్ అందజేస్తారు.
* 600 ల సీ.సీ కెమెరాలలో పర్య వేక్షణ..
* 20 యల్.ఇ.డి. తెరల ద్వారా స్వామివారి కార్యక్రమాలు తిలకించవచ్చు…
* 14 ఎకరాలలో వాహనాల పార్కింగ్
VIP దర్శన వేళలు
రోజుకు 4 విడతలు
ఉదయం 6.30_7.30
ఉదయం10.30_11.00
మధ్యాహ్నం 2.30_3.00
రాత్రి. 7.00_7.30 వరకు