ఒంగోలు బుల్..బుల్స్…మహానందిలో..చల్..చల్

*జనాస్త్రం ప్రతినిది మారంరెడ్డి జనార్ధనరెడ్డి

* రూ. 8 లక్షల నగదు బహుమతులు….
* 3 విభాగాలలో 15 రకాల బహుమతులు….
* ప్రోత్సాహించిన రైతు ప్రేమికులు ….
* ఫ్రిబ్రవరి 27 తేదీ నుంచి మార్చి 1వ తేదీ వరకు …...

శివరాత్రి పర్వదినము సందర్బంగా మహానంది పుణ్య క్షేత్రంలో యమ్.ఎల్.ఎ. బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఆద్వర్యంలో భారీ ఎత్తున వృషభ ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు.అఖిల భారత ఒంగోలు జాతి ఎద్దుల ప్రదర్శన ఈ నెల 27 తేదీ నుంచి మార్చి 1వ తేదీ వరకు ఈ సంబరాలను నిర్వహించాలని మహానంది మండల టి.డి.పి రైతు కమిటి నిర్ణయించింది.27 వ తేదీన సీనియర్స్ వృషభాల ప్రదర్శనలో గెలుపొందిన వృషభ రాజములకు రూ. 3.5 లక్షలు 28 వ తేదీన జరిగే సబ్ జూనియర్స్ బహుమతులకు గాను రూ. 2.55 లక్షలు,న్యూ క్యాటగిరి విజేతలకు రూ.2.00 లక్షలు నగదు బహుమతులను అందజేసి విజేత రైతులను గౌరవిస్తారని నిర్వాహకులు కే.సీ. కెనాల్ ప్రాజెక్ట్ కమిటి అధ్యక్షులు బన్నూరు రామలింగారెడ్డి తెలిపారు. ప్రతి విభాగములో ఐదు బహుమతులు ఉంటాయని అన్నారు.

* ప్రోత్సాహక బహుమతులుకూడా …

పోటీలో పాల్గొంటున్న వృషబాలు 2817.03 అడుగులు దూరానికి మించి లాగినవాటికి అర్ధకేజి వెండి నందిని బహుకరిస్తారు. మాజీ మంత్రి దివంగనేత రామిరెడ్డి వెంకట రెడ్డి జ్ఞాపకార్థము అయన సోదరుడు రామిరెడ్డి దామోధర్ రెడ్డి ఈ బహుమతిని అందజేస్తారు.సీనియర్ విభాగములో వరుసగా మూడు సంవత్సరాలు హ్యట్రిక్ విజయం సాదించిన వృషభ రాజ యజమానులకు రెండు కేజీల వెండి నంది,మరొకరు వెండి నందిని బహుమతిగా అందిస్తారని రామలింగా రెడ్డి తెలిపారు. కోర్టు ఆర్గనైజర్లు గా కొప్పుల శివనాగి రెడ్డి, అరికట్ల శివారెడ్డి, పగిడాల ప్రేమనాధ రెడ్డి, యర్రం నారాయణ రెడ్డిలు ఉంటారన్నారు. వ్యాఖ్యాతలుగా నరసింహ రెడ్డి,నారాయణ స్వామిలు చేస్తారని తెలిపారు.
వివరాల కోసం 8309076669, 9866449536, 7989068889, 9553535328, 7013132608, 9550200027, 9849210671, 7680840498 నెంబర్లను సంప్రదించాలని రామలింగా రెడ్డి అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *