ఉత్సాహం కొండంత..

♦జనాస్త్రం ప్రతినిది మారంరెడ్డి జనార్దనరెడ్డి

⇒నల్లమల గ్రామాలలో నరసింహ నామస్మరణ

⇒ఆళ్లగడ్డలో ఐదురోజులపాటు స్వామి బస

⇒మార్చి 1నుంచి అహోబిలంలో బ్రహ్మోత్సవాలు

పారువేట ఉత్సవాలు నల్లమల అటవీ ప్రాంతంలో కొండంత ఉత్సాహాన్ని నింపుతున్నాయి..దక్షిణ భారత దేశంలోనే అత్యంత శక్తివంతమైన వైష్ణవ క్షేత్రాలలో ఒకటైన అహోబిళ క్షేత్రం చుట్టుపక్కల గ్రామాలలో 40 నుంచి 50 రోజుల పాటు నరసింహ నామ స్మరణతో మారుమ్రోగనున్నది..నల్లమల అటవీ ప్రాంతంలోని అహోబిల క్షేత్రం నుంచి ప్రతి యేట జనవరి 15 నుంచి పిభ్రవరి 28 వరకు ఆళ్లగడ్డ, ఉయ్యలవాడ, రుద్రవరం మండలాలలో నరసింహ స్వామి పల్లకిలో బయలుదేరి మార్చి 1వ తేదీనుంచి దిగువ,ఎగువ అహోబిల క్షేత్రాలలో జరిగే బ్రహ్మోత్సవాలకు హాజరుకావాలని కోరతారు..40 గ్రామాలలో ఒక్క ఆళ్లగడ్డ మినహాయిస్తే మిగిలిన అన్నిచోట్ల ఒకటి రెండురోజులలో భక్తులకు స్వామి దర్శనమిస్తారు..ఆళ్లగడ్డ మునిసిపాలిటీలో మాత్రం పిభ్రవరి 2వతేదీనుంచి 7 వతేదీ వరకు 5 రోజుల పాటు రోెజుకు రెండువేలకు మందికి తక్కువ కాకుండా కనీసం 10వేలమందికి ఉచితంగా దర్శనం దక్కుతూ ఉంటుంది..ఐదురోజుల పాటు ఐదువేలమంది బీదలకు స్థానికులు అన్నదానం చేస్తుంటారు.మొత్తం మీద ఈసారి పంటలు బాగా పండడంతో ప్రజలు కూడా ఉత్సాహంగా స్వామిని గ్రామంలోెకి స్వాగతం పలుకుతున్నారు..అంతేకాక ప్రతి గ్రామంలో వంద కుటుంబాలు కనీసం  10 వేలకు తక్కువ కాకుండా ఖర్చుపెడుతుంటారు..ఇలా ప్రతి గ్రామంలో నరసింహస్వామి సందడి జరుగుతూ ఉంటుంది..స్వామి కొొండ ఎక్కేంతవరకు ఎగువ,దిగువ దేవాలయాలలో కొన్ని గంటలపాటు దర్శనాన్ని రద్దు చేస్తున్నారు..శటారుకూడా భక్తులకు ఇవ్వరు.,.మొత్తం మీద దేశ చరిత్రలోనే ఏ వైష్ణవ క్షేత్రంలో కూడా భక్తులవద్దకు భగవంతుడు వెళ్లే సాంప్రదాయంలేదు..ఒక్క అహోబిళేశునికే ఈ సంప్రదాయం తెలుసుకున్నాం కదా..పారువేట జరిగే గ్రామానికి వెళ్లి నరసింహ స్వామని దర్శనం చేసుకుందాం…రారండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *