♦ జనాస్త్రం ప్రతినిది మారంరెడ్డి జనార్ధనరెడ్డి
⇒నంద్యాల మార్కెట్టు యార్డు పీఠంకోసం
⇒ఓసి మహిళకు అవకాశం
⇒రెడ్డ,కమ్మ, బలిజ,వైశ్య కులనేతలు రంగంలోకి
⇒మంత్రి నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ
జిల్లాకేంద్రంలోని మార్కెట్ యార్డు పదవిని కైవసం చేసుకోవడానికి గత అసెంబ్లీ ,పార్లమెంటు ఎన్నికలలో టిడిపి విజయంకోసం కృషిచేసిన నాయకులు విశ్వప్రయత్నంచేస్తున్నారు..మంత్రి పరూఖ్ నిర్ణయమే పైనల్ కావడంతో ఆయనను ప్రసన్నంచేసుకోవడానికి ఏడు ఎనిమిది మంది ద్వితీయ శ్రేణి టిడిపి నాయకులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు..నంద్యాల మార్కెట్టు యార్డు చరిత్రలోనే మొట్టమొదటిసారిగా మహిళ యార్డు చైర్మన్ గా ఎన్నిక కావడానికి అవకాశం ఏర్పడింది..దీంతో పతులు తమ సతులను ఎంపిక చేయాలని కోరుతున్నారు.గత దశాబ్దకాలంనుంచి నంద్యాల మార్కెట్టు యార్డు చైర్మన్ గా భాద్యతలు స్వీకరించాలని ప్రయత్నంచేసినా మాజీ కౌన్సిలర్ చింతల సుబ్బరాయుడు ఇటీవల మృతి చెందడంతో ఆయన కుటుంబానికి ఈ పదవి ఇచ్చి ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని కొందరు కోరుతున్నారు..జనరల్ ఓసి మహిళ కావడంతో రెడ్డి,కమ్మ, బలిజ,వైశ్య కుటుంబాలు తమకు దక్కాలంటే తమకు దక్కాలని కోరుతున్నారు..ఇప్పటివరకు వినిపిస్తున్న పేర్లలో గుంటుపల్లి హరిబాబు, ఎవి ఆర్ ప్రసాదు, పబ్బతి వేణు, రంగ ప్రసాదు, కామిని మల్లిఖార్జున తదితరులు తమభార్యలకు ఇవ్వాలని కోరుతున్నారు.. ..అయితే వీరుకాకుండా మరో ఐదు మంది కూడా తెలుగుదేశం పార్టీకి తాము అండగా నిలిచామని తమకే పదవీ ఇవ్వాలని కోరారు..మొత్తం మీద పరూఖ్ నిర్ణయంపై ఆసక్తి నెలకొంది..రాజకీయంగా ఎంతో అనుభవం ఉన్న పరూఖ్ ఎవరిపై మొగ్గుచూపుతారోనన్న ఆసక్తి పలువురిలో వ్యక్తం అవుతున్నది..