బస్సులు లేవా బ్రదర్..కోప్పడద్దు..ఎక్కడికి వెళ్లాలి.

♦ జనాస్త్రం ప్రతినిది మారంరెడ్డి జనార్దనరెడ్డి

⇒ నంద్యాల బస్ స్టేషన్ కిటకిట

⇒ 70 బస్సులకు పైగా నంద్యాలనుంచి హైదరాబాదుకు

⇒ నిలబడి వెళ్లిన ప్రయాణీకులు

⇒ ఓర్పు సహనంతో సమాధానం

బస్సులు లేవా సార్…ఎందుకు లేవు..మీరు ఎక్కడికి వెళ్లాలో చెబితే మేము సమయం,సర్వీసు నెంబరు,బస్సు నెంబరు చెబుతామని ఆర్టిసి సిబ్బంది చెప్పడంతోనే ఆదివారం రాత్రి నంద్యాల బస్సు స్టాండులో మూడు గంటలపాటు సమయం సరిపోయింది..ఆదివారం రాత్రికి సంక్రాంతి సెలవులు ముగుస్తుండటంతో హైదరాబాదుకు వెళ్లడానికి వేలాదిమంది బస్టాండుకు సాయంత్రం 6 గంటలనుండి రాత్రి 12 గంటల వరకు చేరుకున్నారు..అక్కడ ఇద్దరు ముగ్గురు సిబ్బంది మాత్రమే ఉండి సమాధానం ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది..దీనితో సిబ్బందికి, ప్రయాణీకులకు ఎప్పుడూ ఎలాంటి గొడవలు తలెత్తుతాయోనన్న భయం వెంటాడింది..నంద్యాల ఆర్టిసి డిపోకు చెందిన ఉన్నతాదికారులు ఎవరూ ప్రయాణీకులకు సమాధానం ఇవ్వడానికి అందుబాటులో లేరు..6 గంటలపాటు బస్సుల వెంట, ప్రయాణీకుల వెంట ముగ్గురు చోటా అధికారులు నాయక్, నాగేశ్వరరెడ్డి, శౌరెడ్డి, అనే వ్యక్తులు సమాధానం ఇచ్చుకుంటూ బస్సులను గమ్యస్థానాలనుండి హైదరాబాదుకు పంపించారు..నంద్యాల డిపోనుంచే 36 రెగ్యులర్, స్పెషల్ సర్వీసులను,కడప,మైదుకూరు,గిద్దలూరు, ఆళ్లగడ్డ తదితర డిపోలనుంచి వచ్చిన మరో 35 బస్సులను హైదరాబాదుకు సాగనంపాల్సి వచ్చింది..చాలామంది ప్రయాణీకులు నిలబడుకుని కూడా వెళ్లాల్సి వచ్చింది..ప్రత్యేక బస్సులలో వెళ్లవచ్చునని ఆకస్మికంగా బస్టాండుకు చేరుకున్న ప్రయాణీకులు ఈ ముగ్గురిపై అగ్గిమీద గుగ్గిలం అయ్యారు..ప్రయాణీకుల ఆగ్రహం వ్యక్తంచేస్తుంటే చోటా అదికారులు ఎంత ఓర్పుతో,సహనంతో సమాధానం ఇచ్చిన వినుకోలేదు..మీచేత ఏమవుతుంది..మాకు బస్సు కావాలి..పెడతారా అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు..కనీసం ఇటువంటి సమయంలోనైనా ఉన్నతాదికారులు బస్టాండులో లేకుంటే ఎలా అని ఆగ్రహం వ్యక్తంచేయగా మీకు ఏంకావాలో చెప్పండి మేము అరేంజ్ చేస్తామని నచ్చ చెప్పారు..మొత్తం మీద కొన్ని గంటలపాటు బస్సుల కోసం అదికారులపై వందలాదిమంది ప్రయాణీకులు భగ్గుమన్నా ముగ్గురు సమయస్పూర్తితో వ్యవహరించి పెద్దగా సమస్యలు లేకుండా పరిష్కరించారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *