జనాస్త్రం ప్రతినిది మారంరెడ్డి జనార్దన రెడ్డి
మొహం చాటేసి తిరుగుతున్న బెట్టింగ్ రాయుళ్లు
పోటీలకు వెళ్తుండి హుషారు
సంక్రాంతి పర్వదినం సందర్భంగా విజయవాడ ప్రాంతంలో కోళ్ల బెట్టింగ్‌లకు వెళ్లిన నంద్యాల జిల్లా వాసులు 20 కోట్లకు పైగా కోళ్ల పందెంలో పోగోట్టుకున్నట్లు స్థానికంగా చర్చించుకుంటున్నారు. పర్వదినానికి 2, 3 రోజుల ముందు విజయవాడ ప్రాంతంలోని గన్నవరం, దెందులూరు తదితర ప్రాంతాలకు జిల్లాలోని నంద్యాల నుంచి ఐదు వందల మంది ,ఆళ్ళగడ్డ, బనగానపల్లె, పాణ్యం, శ్రీశైలం, నందికొట్కూరు, డోన్ తదితర ప్రాంతాలకు చెందిన మరో వెయ్యి నుంచి 1500 వందల మంది పోటీలకు వెళ్లినట్లు తెలుస్తొంది. వెళ్లిన వారిలో పది నుంచి ఇరవై మంది మాత్రమే 50 వేలకు లోపు గెలుచుకున్నారని మిగిలిన వారాందరూ 20 కోట్లకు పై కోల్పోయినట్లు తెలుస్తొంది. పోటీలకు వెళ్లడం గత దశాబ్ద కాలం నుంచి వీరికి అలవాటే. అయితే పోగోట్టుకునే మొత్తమే ఈసారి గతంతో పొలిస్తే ఐదు, ఆరు రెట్లు అధికంగా ఉండవచ్చని అంచనా. వీరంతా 90 శాతం మంది బాడుగ వాహానాల్లో వెళ్లారు. స్థానికంగా 80 శాతం మంది బెట్టింగ్ రాయుళ్లు చెయి బదుళ్లగా రెండు రూపాయాల నుంచి రూ.పది మధ్య వడ్డికి తీసుకువెళ్లినట్లు చర్చ సాగుతున్నది. మొత్తం మీద వెళ్లేటప్పుడు ఎంతో హుషారుగా వెళ్లిన బెట్టింగ్ రాయుళ్లు తిరిగి వచ్చిన తరువాత స్నేహితులకు, శ్రేయోభిలాషులకు, అప్పుతీసుకున్న వారికి మొహం చాటేసి తిరుగుతున్నారు. మొత్తం మీదా బెట్టింగ్ షాక్ గురైనవారు అప్పు తీరే వరకు ఎదోక ప్రయత్నంతో డబ్బు సంపాదించుకునే యత్నంలో నిమఘ్నం కాక తప్పదు.