జనాస్త్రం ప్రతినిది మారంరెడ్డి జనార్ధనరెడ్డి
*కార్తీక మాసం ముగిసే వరకు ఆన్ లిమిటెడ్ ,ఆన్ స్టపబుల్ , జంబో దర్శనం లాగా భక్తులకు శ్రీ మహానందేశ్వరుడు,శ్రీ కామేశ్వరి దేవి ఆలయం లో దర్శనం ఏర్పాటు చేస్తున్నట్టు ఆలయ ఈవో నల్ల కాలువ శ్రీనివాస్ రెడ్డి జనస్రమ్ కు తెలిపారు…
*అక్టోబర్ 22 తేదీ నుంచి నవంబర్ 20 తేదీ వరకు మహానంది ఆలయం లో కార్తీక వేడుకలు,పూజలు భక్తుల ఆధ్వర్యం లో జరుపుతున్నట్టు అన్నారు..
*కార్తీక మాసంలో రూ 2000/_ చెల్లించిన భక్తులకు ఆన్లైన్ లో గోత్రం,పేరు మీద మహానంది ప్రధాన ఆలయం లో అభిషేకం చేస్తారు అన్నారు…ప్రసాదం , తీర్థం పోస్ట్ ద్వారా పంపుతామన్నారు…
*భక్తులకు ప్రతి రోజు రాత్రి 10 గంటల నుంచి తెల్లవారుజామున 4 గంటలవారుకు దర్శనం ఉండదని అన్నారు..
*కార్తీక మాసంలో నాలుగు సోమవారాలలో జల హారతి ఇస్తారని అన్నారు..
*అది, సోమవారం లలో గర్భాలయం లో అభిషేకాలు రద్దు చేస్తామని శ్రీనివాసరెడ్డి తెలిపారు..
*భక్తుల కోసం సామూహిక అభిషేకాలు చేశామన్నారు…
*భక్తుల విశ్రాంతి కోసం పొచ భవనం లో ఉచితంగా విశ్రాంతి అవకాశం కల్పిస్తామన్నారు..
*భక్తుల వాహనాలు కోసం లైటింగ్ వసతిలో రెండు పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేస్తున్నట్టు శ్రీనివాస రెడ్డి తెలిపారు..
*నవంబర్ 18,19 తేదీలలో లక్షా బిల్వార్చన , లక్ష కుంకుమ అర్చన ,శాంతి కళ్యాణం జరుపుతామని శ్రీనివాసరెడ్డి అన్నారు…
*Q లైన్ లో నిలిచిన భక్తులకు పాలు, బిస్కెట్లు అందజేస్తామన్నారు…