తిరుమల అక్షింతలతో ఆశీర్వాదం…

♥జనాస్త్రం ప్రతినిది మారంరెడ్డి జనార్ధనరెడ్డి

♦తిరుమల అక్షింతలతో ఆశీర్వాదం…
♦మొదటి లేఖ పంపండి…..
♦పెళ్లికి నెలరోజుల ముందు పోస్టు చేయాలి…


మీకు అఖిలాంద్ర కోటి బ్రహ్మండనాయకుడి అక్షింతలతో పలువురు దీవించాలని ఆసిస్తూఉంటే మీరు వివాహ లేఖను ముద్రించిన వెంటనే తిరుమలకు పోస్టు ద్వరా పంపితే మీకు అమ్మవారి కుంకుమ మరియు అయ్యవారి అక్షింతలు కవరు నేరుగా మీ ఇంటికి వాలుతుంది. పూర్వము వివాహ లేఖను మొదటిది శ్రీ వేంకటేశ్వర స్వామికి పంపి ఇతరులకు కార్డులను పంచేవారు. కాల క్రమేణా ఈ ప్రక్రియకు దూరమౌతూ వస్తున్నారు. అయితే దశాబ్దక్రితం నుంచి అక్షింతలు కుంకుమ పంపే సాంప్రదాయమే తిరుమల తిరుపతి అదికారులు ఏర్పాటు చేయడంతో ఇటీవల అక్షింతల కోసం ఆలయానికి కార్డులను పంపే సాంప్రదాయం పెరిగిందని పలువురు భక్తులు పేర్కోంటున్నారు. మీరు పంపాల్సిన చిరునామా ఇదే..
శ్రీ లార్డు వేంకటేశ్వర స్వామి,
ది ఎక్షిక్యూటివ్ ఆఫీసర్,
టి.టి.డి. అడ్మినిస్ర్టేటివ్ బిల్డింగ్,
కే.టి.రోడ్డు, తిరుపతి – 517501

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *