♦జనాస్త్రం ప్రతినిది మారంరెడ్డి జనార్ధనరెడ్డి
⇔జగన్ మనస్సును దొచుకున్న హీరోలు వీరే
⇔ప్రత్యర్థుల అంచనలు తలకిందులు
⇔సర్వేలను జయించిన అభ్యర్థులు
⇔జల్లడ పట్టి ఎంపిక చేసిన జగన్
⇔ఒక్కొకరి టిక్కెట్ వెనక ఇది ఒక కథ
వైయస్ఆర్సిపి పార్లమెంట్ అసెంబ్లీ అభ్యర్థులందరూ ప్రత్యర్థుల అంచనాలను తలకిందులు చేప్తూ అభ్యర్థులుగా బరీలోకి దిగడం చర్చనియంశంగా మారింది. నంద్యాల పార్లమెంట్ పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా అందులో నందికొట్కూర్ అసెంబ్లీ నుంచి 2019లో ఎన్నికైన ఆర్థర్ మినహాయిస్తే మిగిలన ఆరుగురు పాత వాల్లే కావడం విశేషం. ఏడాది నుంచి పార్టీ అధ్యక్షుడు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నెల నెలా వీరిపై ప్రజల్లో సర్వేను నిర్వహిస్తూ వీరి బలం బలహీనతలను అంచన వేస్తూ గడప గడప వంటి కార్యక్రమాలను అమలు చేస్తూ ప్రజల్లోకి తిప్పారు. అయినప్పటికి కుల, మత సమీకరణలతో పాటు అభ్యర్థులకున్న మైనెస్ పాయింట్లను బేరీజు వేసుకొని టిక్కెట్లు లభించే అవకాశం లేదని ప్రచారం సాగడంతో ఎవరికి వారు టెన్షన్‌కు గురైయ్యారు.
అసెంబ్లీల వారిగా ..
బనగానపల్లె సభలోనే జగన్ ప్రకటన
బనగానపల్లె : బనగానపల్లె అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాటసాని రామిరెడ్డికి టిక్కెట్ గగనమేనని ప్రచారం సాగింది. అయితే కాటసాని తప్ప మరోకరు బిసీతో ఢీకొనడం సాధ్యం కాదని పార్టీకి నివేదికలు అందడంతో వారికి పార్టీ ఓటు వేసింది. ఇక్కడికి రామిరెడ్డి సోదరుడు పార్టీ జిల్లా అధ్యక్షడు కాటసాని రాంభూపాల్ రెడ్డి గానీ, నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిషోర్ రెడ్డిని గానీ బరీలోకి దించాలని ప్రయత్నాలు జరిగాయి. చివరికి రామిరెడ్డినే బనగానపల్లె సభలో జగన్ ప్రకటించారు.
నో పోటీ
ఆళ్లగడ్డ, డోన్ : ఆళ్లగడ్డ, డోన్ నియోజకవర్గాల్లో గంగుల బ్రిజేంద్ర రెడ్డి, మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌లను కాదని ఎవరు పోటీ చేయడానికి ముందకు రాలేదు. ఆళ్లగడ్డలో మాత్రం బ్రిజేంద్ర రెడ్డి స్థానంలో ప్రభాకర్ రెడ్డికి టిక్కెట్ ఇస్తే ఎలా ఉంటుందనే అంశం పై సర్వేలు జరిపారు. ప్రభాకర్ రెడ్డి మాత్రం మా ఇద్దరిలో ఎవరైనా ఒకటేనని బ్రిజేంద్రకే ఇవ్వాలని కోరడంతో ఇక్కడ పెద్దగా కసరత్తు జరగలేదు.
గెలుపు నల్లేరు పై నడకే
శ్రీశైలం : ఈ నియోజకవర్గంలో బుడ్డా శేషరెడ్డి రెడ్డి టిక్కెట్ కోసం ప్రయత్నం చేసినట్లు సమాచారం. ఇక్కడ కుడా చక్రపాణి గెలుపు నల్లేరు పై నడకేనని వైయస్ఆర్సిపి అంచన. అయితే చక్రపాణి రెడ్డిని నంద్యాల పార్లమెంట్‌కు పోటీ చేయమని ప్రతిపాదన పార్టీ నాయకులు తెచ్చినట్లు తెలుస్తొంది. ఇందుకు సుముకత వ్యక్తం చేస్తూ తనయుడు కార్తీక్ రెడ్డికి అసెంబ్లీ టిక్కెట్ ఇవ్వాలని పట్టుబటిన్నట్లు సమాచారం. దీంతో తనయుడు కంటే తండ్రి చేసిన సేవలు, విరాళాలు భారీగా కలిసి వస్తాయని చక్రపాణి రెడ్డికే జగన్ సీటు కేటాయించారు.
బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి ఆశీస్సులతో
నందికొట్కూర్: ఈ నియోజకవర్గంలో మార్పు జరగకుంటే ఏడుకు ఏడు పాత కాపులే పోటీచేసే అవకాశం ఉండేది. రాష్ట్రంలోని 25 పార్లమెంట్ స్థానాల పరిధిలోని అసెంబ్లీలలో నంద్యాల అరుదైనా రికార్డును వైసిపిలో నమోదు చేసుకొనేది. కానీ బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి పట్టుబట్టి ప్రస్తుత ఎమ్మెల్యే ఆర్థర్‌కు టిక్కెట్ రాకుండా జగన్ రెడ్డి దగ్గర చూశారు. చివరికి బైరెడ్డి మాట నెగ్గెవిధంగా డా. ధార సుధీర్‌ను ఎంపిక చేశారు. ఈయనను గెలింపిచే బాధ్యత బైరెడ్డి సిద్దార్థకు అప్పజెప్పారు.