జనాస్త్రం ప్రతినిది మారంరెడ్డి జనార్ధన రెడ్డి
- నీకు రాజకీయాలు వద్దు… ప్రేమతో చెబుతున్నాం సార్…
- నీకు న్యాయవాద వృత్తి బెస్టు
- సినిమా కుడా వద్దు
- శ్రేయోభిలాషుల నుంచి కోటి 50 లక్షలు విరాళాల హామి
- అభిప్రాయాల సేకరణలో సూరి తలమునకలు
- సూరి రాజకీయ ప్రేమికుడి నుంచి కుడా వ్యతిరేకతే
నీవు మంచి లాయర్వు వృత్తి పరంగా ఎంతో పురోగతిలో ఉన్నావు. నీకు రాజకీయ వ్యసనం పట్టడం ఏమిటి అని కాంగ్రెస్ టిక్కెట్ పై ఆళ్లగడ్డ నియోజకవర్గం నుంచి పోటీ చేసే యోచనలో ఉన్న న్యాయవాది పాపిరెడ్డి గారి సూర్యనారాయణరెడ్డిని (సూరి) ఆయన సహాచర న్యాయవాదులు, శ్రేయోభిలాషులు ప్రశ్నిస్తునట్లు సమాచారం. ఆయనను కొందరు కాంగ్రెస్ నేతలు కలుసుకొని నీవు ఆళ్లగడ్డ పోటీకి సై అంటే మేము సై అనడానికి సిద్ధంగా ఉన్నామని వివరించారు. దీంతో ఆయన వారికి ఏమి చెప్పలేక సైలెంట్ అయ్యారు. ఆ తరువాత ఈ విషయాన్ని జనాస్త్రం వెలుగులోకి తేవడంతో పెద్ద వైరల్ అయ్యింది. రహాస్యంగా ఉన్న ఈ వ్యవహారం రట్టు కావడంతో సూరి అయోమయానికి గురి అయ్యారు. సూరి ప్రేమించే ఒక నాయకుడు మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో నీవు రాజకీయాల్లోకి రావద్దు.., నా వద్దకు నీవు విశ్రాంతి సమయంలో వచ్చి వెళ్లమని చెప్పానన్న విషయాన్ని సూరికి గుర్తు చేశారు. అంతేకాక ఇప్పుడు నీకు ఏ అవసరమున్న ఆ పనిని చేసుకునే సత్తా ఉందని వివరించినట్లు సమాచారం. మిగిలిన వారు మాత్రం వృత్తి పైనే దృష్టిని సారించామని చెప్పారు. సినిమా కుడా తీయడం వద్దని వివరించినట్లు తెలుస్తొంది. మరి కొందరూ మాత్రం వస్తే 2024 ఎన్నికల్లో రాజకీయాలోకి రా… లేదంటే 2029కి నీకు 67 నుంచి 70 ఏళ్ల వయస్సు రావచ్చని నీకు రాజకీయాలు చేసే శక్తి దేవుడు ఇచ్చినా… రాజకీయ పార్టీలు అవకాశం ఇవ్వవని తెగేసి చెప్పినట్లు తెలుస్తొంది. హైదరాబాద్కు చెందిన కొందరు వ్యక్తులు మాత్రం కోటీ నుంచి రెండు కోట్ల వరకు విరాళాలు ఇస్తామని హామి ఇచ్చినట్లు సమాచారం. కనీసం షర్మిల దగ్గరికైనా వెళ్లి వద్దాం రా … అంటూ శ్రేయోభిలాషులు పిలుస్తునట్లు సమాచారం. అయితే సూరి ఎన్నికల నిర్ణయంతో పలువురిలో ఆందోళన, మరికొందరిలో ఆనందం కలిగిన ఏ నిర్ణయం తీసుకోలేక టెన్షన్లో ఉన్నట్లు ఆయన అనుచరులు జనాస్త్రంకు తెలిపారు. సూరి కొద్ది రోజుల్లోనే సప్సెన్స్కు తెర దించే అవకాశాలు లేకపోలేదు.