♦జనాస్త్రం ప్రతినిది మారంరెడ్డి జనార్దనరెడ్డి
తనకుమార్తెను కిడ్నాప్ చేశారని నంద్యాలపట్టణంలోని మాజీ ఎంఎల్ఎ శిల్పా రవిచంద్రకిషోర్ ఇంటి ఎదుట రాయలసీమ ప్రతిభ ఎడిటర్ బొల్లవరం శివకుమార్ దంపతులు ఆదివారం సాయంత్రం దర్నాను నిర్వహించారు..39 వవార్డ వైయస్ ఆర్ సిపి కౌన్సిలర్ లక్ష్మినారాయణ(పండు) కుటుంబ సభ్యులు తన కుమార్తెను కిడ్నాప్ చేశారని ఆయనను పార్టీనుంచి సస్పెండు చేసి కఠిన చర్యలు తీసుకునేంతవరకు ఆందోళన విరమించే ప్రసక్తే లేదని హెచ్చరించారు..ఆయనకు మద్దతుగా నంద్యాల పట్టణంలోని పలువురు పాత్రికేయులు వెళ్లి అండగా నిలిచారు..అనంతరం పట్టణంలోని పోలీసులు రంగ ప్రవేశంచేసి చర్చలు శివకుమార్ కుటుంబ సబ్యులతో జరిపారు..ఇంకా ఆందోళనను శివకుమార్ కొనసాగిస్తునే ఉన్నారు..