♦జనాస్త్రం ప్రతినిది మారంరెడ్డి జనార్దనరెడ్డి
⇔సాగునీటి సమస్యలపై ప్రభుత్వం దృష్టిని సారించాలి
⇔ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి రావడానికి సీమసమస్యలు కూడా ఒక కారణం
రాయలసీమ సాగునీటి వనరులపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తే సహించే ప్రసక్తే లేదని రాయలసీమ నీటిపారుదల సాదన సమితి అధ్యక్షులు బొజ్జా ధశరధరామిరెడ్డి హెచ్చరించారు..ఆదివారం నంద్యాల పట్టణంలోని రామకృష్ణా డిగ్రీ కళాశాలలోని వివేకానంద ఆడిటోరియంలో తుంగభద్ర, కృష్ణాజలాల సంరక్షణపై సాగునీటి సాధన ప్రతినిదులతో ప్రత్యేక సమావేశాన్ని దశరదరామిరెడ్డి నిర్వహించారు..ఏ ప్రభుత్వం వచ్చినా రాయలసీమ సాగునీటిపై ప్రత్యేక దృష్టిని సారించడంలేదని ఆవేదన, ఆగ్రహం వ్యక్తంచేశారు..ప్రస్తుతం రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి గత ప్రభుత్వం సాగునీటి సమస్యలపై దృష్టిని సారించక పోవడం ఒక ప్రధాన అంశంగా ఆయన వివరించారు..ఇప్పటికైనా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కర్నూలు,కడప ,అనంతపురం ,చిత్తూరుజిల్లాలలోని అధికారులు ,సాగునీటిసమితి ప్రతినిధులతో సమావేశాన్ని నిర్వహించి సమస్యలపై దృష్టిని సారించాలని కోరారు..లేనిపక్షంలో రైతులే ఉద్యమించే పరిస్తితి వస్తుందని ఆయన హెచ్చరించారు..సిద్దేశ్వరం అలుగు నిర్మాణం,గుండ్రేవుల రిజర్వాయరు ,వేదవతి ఎత్తిపోతల నిర్మాణాలను తక్షణమే చేపట్టాలని ,లేనిపక్షంలో రాయలసీమ విముక్తి ఉద్యమానికి పాలకులే ఆజ్యం పోసిన వారు అవుతారన్నారు.. ప్రస్తుత ప్రభుత్వంపై సీమసమస్యలు పరిష్కారం అవుతాయనే నమ్మకం ఉందని ,ఆ నమ్మకాన్ని వమ్ము చేసుకోవద్దన్నారు..సమావేశంలో సీమ ప్రతినిదులు వైయన్ రెడ్డి అద్యక్షత వహించగా డాక్టర్ నాగన్న ,కెడిసిసి డైరెక్టరు బెక్కెం రామసుబ్బారెడ్డి ,పర్వేజ్, ఖాసిం, ఏరువ రామచంద్రారెడ్డి,జూపల్లె గోపాలరెడ్డి, తదితరులు పాల్గొన్నారు..