¡¡ కూరగాయల వితరణలో షాకింగ్ కథే…¡¡

♦జనాస్త్రం ప్రతినిది మారంరెడ్డి జనార్ధనరెడ్డి

⇒ ¡దాదాపు 3 నుంచి 4కోట్ల విలువచేసే కూరగాయలు వితరణ¡

⇒ ఈవితరణకు 22 ఏళ్లు సమయం

⇒ ఎలాంటి ప్రభుత్వ గుర్తింపుకు నోచుకోని ప్రసాదు

⇒ నా అంతిమశ్వాస వరకు వితరణ జరుగుతుంది

రాష్ట్రంలో పలు ప్రధాన దేవాలయాలలో ప్రధాన పండుగల సమయంలో అన్నదానాలకు వేలు,లక్షలు ,విలువ చేసే కూరగాయలు దానం  చేయడం లో నంద్యాల జిల్లా కేంద్రం లోని కూరగాయల వ్యాపారి రామన్న కుమారుడు ప్రసాద్ ముందు ఉంటున్నారు..ఐతే ఆయన వ్యాపారం లో వచ్చిన ఆదాయాన్ని టెంపుల్స్ దగ్గర జరిగే అన్నదాన కార్యక్రమం కు కేటాయించడం వెనుక పెద్ద కథ ఉందని అంటున్నారు…అన్న దానం కు కూరగాయలు ఉచితంగా ఇవ్వడం 2002 నుంచి ప్రారంభించారు..తన కుమార్తె తో కలసి 2002 లో జరిగిన శివరాత్రి పండుగ రోజు సాయంత్రం మహానంది టెంపుల్ కు వెళ్ళారు.

అక్కడ ఆకస్మికంగా ప్రసాద్ కూతురు అగుపించలేదు.. దీంతో తీవ్ర టెన్షన్ కు గురైన ప్రసాద్ మహానంది ఆలయం పరిసరాలలో తిరిగి వచ్చి ఆలయం లోకి వెళ్లి మహానందీశ్వరుడు ను వేడుకుంటూ ఉండి పోయారు..చివరికి మహానంది లో జరిగే నిత్య అన్న దానంకు ఉచితంగా కూరగాయలు ఇచ్చి ఋణo తీర్చు కొంటానని మొక్కుకున్నారు..కొద్ది నిమిషాలకే తనకుమార్తె కళ్ళ ముందు అగుపించడం విస్మయానికి ప్రసాద్ గురి అయ్యారు..అప్పటి నుంచి ప్రతీ రోజూ జరిగే అన్నదాన కార్యక్రమం కు ఉచితంగా కూరగాయలు అందిస్తున్నారు.. 20ఏళ్లు నుంచి కూరగాయలు మహానంది కి ఇస్తుండగా శ్రీ కాళహస్తి టెంపుల్ కు శివరాత్రి సమయం లో17 ఏళ్ల నుంచి 2లక్షల రూపాయలకు  తక్కువ కాకుండా ప్రతి ఏటా కూరగాయలు అందిస్తున్నారు..వీటిని అక్కడి కమిషనర్లు గాని ,ఎంఎల్ ఎ లు  గానీ రిసీవ్ చేసుకొని ప్రసాద్ ను గౌరవించిన  సందర్భాలు అనేకం. నంద్యాల చుట్టు ప్రక్కల ఉండే అహోబిలం టెంపుల్ తో పాటు మరికొన్ని ఆలయాలకు ఉచితంగా కూరగాయలు సరఫరా చేస్తున్నారు. ఇప్పటి వరకు మూడు నుంచి నాలుగు కోట్ల రూపాయలు విలువ చేసే కూరగాయలు దానంగా అందజేసి ఉంటారని అంచనా..

ఈసారి..ప్రభుత్వ గుర్తింపు ¡

ఆగష్టు 15, జనవరి 26రిపబ్లిక్ డే సందర్భంగా కొంత మంది సేవ చేసే వారికి ప్రశంస పత్రాలతో ప్రభుత్వం అభినందిస్తుంది…కానీ ప్రసాద్ కు ఏది దక్క లేదు..గత కరోనా టైమ్ లో కూడా ఉచితంగా కూరగాయలు పేదలకు ఇచ్చారు .అప్పుడు కూడా గుర్తింపు లభించ లేదు..ఈసారీ గుర్తింపు లభించే అవకాశాలు ఉన్నాయని అధికార పార్టీ లో చర్చించుకుంటున్నారు.. 

మార్కెట్ యార్డ్ డైరెక్టర్ రేసులో.

మంత్రి ఫరూక్ కు ప్రసాదు దగ్గరగా  ఉండడం తో మార్కెట్ యార్డ్ డైరెక్టర్ గా బిజినెస్ మెన్ కోటా లో నియమించే అవకాశం ఉందని అనుకొంటున్నారు..జనాస్త్రం ప్రసాద్ ను అడుగగా నాకు భగవంతుడు అంటే ప్రాణం..అందువల్ల ప్రభుత్వం ప్రశంసలకు గానీ ,నామినేషన్ పోస్ట్ లకోసం దానం చేయడం లేదన్నారు..నా అంతిమ శ్వాస వరకు నాకు వచ్చే ఆదాయం లో దేవుని భక్తులకు సహాయం చేయడం జరుగుతుందని అన్నారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *