జనాస్త్రం ప్రతినిది మారంరెడ్డిజనార్ధనరెడ్డి
మహానందిలో జలకాలాట…
శెలవులు వస్తే మహానందివైపు…..
కిటకిటలాడుతున్న కోనేరులు …..
కోట్టు ఖర్చుపెట్టినా రాని స్వచ్చత……
దక్షిణ భారతదేశంలో విద్యార్థులకు సెలవులు వస్తే మహానంది పుణ్యక్షేత్రం సందర్శించాలనే ఆలోచన భక్తులలో యాత్రికులలో కొనసాగుతున్నది. పెద్దలు ఐతే మహానందీశ్వరుడు, కామేశ్వరీదేవి లను పూజించాలని, యువకులు, చిన్నారులు క్షేత్రం ఆవరణలోని మూడు కోనేరులలో గంటల తరబడి ఈతకొట్టి ఆనందపడాలనే ఆలోచనలతో క్షేత్రాన్ని సందర్శిస్తున్నట్లు ఆలయ అదికారులు అంటున్నారు. శని ఆదివారాలలో నంద్యాల జిల్లా లోని పలు ప్రాంతాలకు చెందిన యువకులు మోటర్ సైకిల్ లలో వచ్చి ప్రదాన కోనేరులో ఈత కొట్టాలని వస్తున్నారు. మొత్తం మీద మహానంది క్షేత్రంలో మూడు కొలనులు రోజుకు కనీసం మూడు వేల మందికి తక్కువ కాకుండా జలకాలాటలో పాల్గొంటూ ఆనందంలో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. కేవలం యువకులే కాకుండా, యువతులు కూడా పురుషులతో సమానం గా కోనేరులలో ఈత కోడుతూ కేరింతలతో ఆకాశేమే హద్దుగా ఆనందాన్ని పొందుతున్నారు. కోనేరులో ఎంతమంది ఎన్ని గంటలు ఈతకొట్టిన చిన్న మరక కూడా నీళ్లలో అగుపించదు. అంతే కాక నీళ్లలో వేసిన నాణాలు అలాగే పైకి అగుపిస్తున్నాయి అంటే నీటి శుబ్రత ఏవిదంగా ఉందో అర్థం అవుతుంది. రోజుకు లక్షరూపాయలుఖర్చు పెట్టినా నీళ్లు స్వచ్చంగా అగుపించవని ఆలయ నిర్వహులు, భక్తులు పేర్కోంటున్నారు.