♦జనాస్త్రం ప్రతినిది మారంరెడ్డి జనార్ధనరెడ్డి
⇔చావో..రేవో తేల్చుకునేవారితో నామినేషన్లు
⇔వెంటాడదాం పోలింగును అనుకూలం చేసుకుందాం
⇔రౌడీలు కాదు ….స్వభావం ఉంటే చాలు
అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో తమ గెలుపు కోసం చావో…. రేవో…. తేల్చుకునే అనుచరులతో నామినేషన్లు వేయించుకోవడానికి నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గం లోని నేతలతో పాటు 52 నియోజకవర్గాల్లో అసెంబ్లీ అభ్యర్థుల అన్వేషణ ప్రారంభించారు. ప్రస్తుత నామినేషన్లు ఈనెల 25వ తేదీన చివరి రోజు కావడంతో వారికి మంచి రోజుతో సంబంధం లేకుండా స్వతంత్ర అభ్యర్థులు గా గానీ ఎన్నికల సంఘం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల తరఫున గాని నామినేషన్లు వేయించే ఆలోచనల్లో అభ్యర్థులు తలమునకలు అయ్యారు .వీరు తమకు ఓట్లు పడకుండా ప్రయత్నం చేసే ప్రాంతాల్లో తిరిగే బాధ్యతను అప్పగిస్తారు. అంతేకాక తమ ప్రత్యర్థులు తరఫున కూర్చొనే ఏజెంట్లను భయపెట్టడం గాని చేస్తారు. మొత్తం మీద పోలింగ్ రోజున మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతం నుండి సాయంత్రం ఐదు గంటల వరకు వీరి అవసరం ఉంటుంది. ప్రత్యర్థుల వాహనాలను వెంటాడుతూ వారి వాహనం ఎక్కడ ఆగితే అక్కడ వీరి వాహనం ఆగుతుంది వారి వాహనం కదిలితే వీరి వాహనం కదులుతుంది .ఇలా ఒకరికొకరు తమకు అనుకూలమైన పోలింగ్ను జరుపుకోవడానికి ప్రయత్నం చేస్తారు .రౌడీలతో నామినేషన్ వేయిస్తే పోలీసులకు వాటిని తిరస్కరించమని సూచించే అవకాశం ఉంది. అందువల్ల రౌడీలు కాకుండా ఆ స్వభావం ఉన్న వారితో నామినేషన్లు వేయించడానికి నేతలు చూస్తున్నారు