♦జనాస్త్రం ప్రతినిది మారంరెడ్డి జనార్ధనరెడ్డి
⇔మిస్సు కానేకాదు … ఎస్ పోచానే
⇔ఎన్నో వడపోతల మధ్య పోచాకే టిక్కెట్
⇔జనాస్త్రం ఎప్పుడో అంచన వేసింది
⇔చాల మంది ఎమ్మెల్యేల సుముఖత కుడా కలిసి వచ్చింది
⇔ఎమ్మెల్యేల మద్దతు పోచాకే
నంద్యాల పార్లమెంట్ అభ్యర్థిగా పోచా బ్రహ్మానందరెడ్డి ఎంపిక వెనుక పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఎన్నో వడపోతలు పోశారు. పోచా స్థానంలో మరో అభ్యర్థిని ఎంపిక చేయాలని చేసిన ప్రయత్నం ఫలించలేదు. దీంతో పోచానే తిరిగి ఫైనల్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈయన అదృష్టం కొద్ది ఏడు మంది ఎమ్మెల్యే అభ్యర్థులు పోచా కావాలని జగన్ దగ్గర పట్టుబట్టడం ఆయనకు ప్రధానంగా కలిసి వచ్చింది. పోచా మాత్రం తనకే టిక్కెట్ లభిస్తుందన్న ధైర్యంతో ఉన్నారు. స్కొలింగ్లలో ఖాదర్ బాషా, సినీ నటుడు ఆలీ పేర్లు ప్రసారం అయిన్నప్పుడు ఆయన బంధువులు, స్నేహితులు సహానం కోల్పోయారు. ఆయిన మౌనంగానే ఉండిపోయారు.. ఏమి జరిగిన మన మంచికే … మనం మాత్రం జగన్‌కే అండగా నిలువాలని చెబుతూ వచ్చారు. ఈ సహానం, ఓర్పు మౌనం కలిసి వచ్చాయని కుడా రాజకీయ పరిశీలకులు అంచన వేశారు. నూరు ఆరైనా ముస్లీం మైనార్టీలకు టిక్కెట్ లభిస్తుందని మెజార్టీ వైసిపి నాయకులు భావించగా అందరి అంచనాలను తలకిందులు చేస్తూ పోచానే అభ్యర్థిగా ప్రకటించారు. జనాస్త్రంలో ఎస్సా… మిస్సా అనే స్టోరితో పాటు మరికొన్ని కథనాలను ప్రచురించగా ఫైనల్‌గా పోచాకే టిక్కెట్ లభించే అవకాశం ఉందని చెప్పడం జరిగింది. దివంగత ఎంపీ ఎస్పీవై రెడ్డి పిఏ శర్మతోపాటు మరికొందరు పోచానే ఎస్సాంటూ చేసిన కామెంట్లను టిక్కెట్ ప్రకటించిన రోజు గుర్తు చేసుకున్నారు. నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీలలో 2.50 లక్షల నుంచి 3 లక్షల ఓట్లు మైనార్టీలకు ఉన్నాయని అందువల్ల మైనార్టీనే జగన్ బరీలోకి దింపుతారని అంచన వేశారు. సినీ నటుడు ఆలీ, ఖాదర్ బాషా, కడపకు చెందిన మంత్రి అంజాద్ బాషా పేర్లు వినిపించాయి. ఓసిల తరఫున పాణ్యం, శ్రీశైలం, నియోజకవర్గాల ఎమ్మెల్యేలు కాటసాని రాంభూపాల్ రెడ్డి, చక్రపాణి రెడ్డి పేర్లు కుడా వినిపించాయి. అయితే వీరిద్దరూ తమ కుమారులకు ఎమ్మెల్యే టిక్కెట్ ఇస్తే తాము పార్లమెంట్‌కు పోటీ చేస్తామని లేని పక్షంలో తమను ఎమ్మెల్యేలుగా కొనసాగించాలని వత్తిడి తేవడంతో పార్టీ తలొగ్గిన్నట్లు తెలుస్తొంది. చివరికి వివాద రహితుడైన పోచా బ్రహ్మానందరెడ్డిని మరో దఫా పోటీకి పార్టీ నిర్ణయించింది.