జనాస్త్రం ప్రతినిది మారంరెడ్డి జ నార్ధనరెడ్డి
పారువేట పుణ్యాన
దక్షిణ భారతదేశంలోనే అత్యంత శక్తి వంతమైన వైష్ణవ క్షేత్రాల్లో ఒకటైనా అహోబిలంలో దర్శనానికి వచ్చే భక్తులకు 45 రోజుల పాటు శటారు దక్కదు. అహోబిలం క్షేత్రంలోని ఎగువ, దిగువ నరసింహా స్వాములను దర్శనం చేసుకునే భక్తులకు తీర్థం ఇచ్చిన తరువాత, శటారును తల పై పెట్టి పూజారులు ఆశీర్వదిస్తుంటారు. అయితే సంక్రాంతి పర్వదినం రోజు నుంచి నరసింహా స్వామి భూ దేవి శ్రీ దేవి అమ్మవార్లతో కలిసి పారువేటకు బయలు దేరారు. ఆళ్లగడ్డ, రుద్రవరం, ఊయలవాడ మండలల్లోని 36 గ్రామాల్లో 45 రోజులు పర్యటిస్తారు. అ తరువాత స్వామి కొండ ఎక్కి బ్రహ్మోత్సవాలు జరుపుకుంటారు. పారువేటలో స్వామి ఉండడంతో అత్యంత పవిత్రమైన శటారు కుడా ఆయన వెంట వచ్చి గ్రామీణ ప్రజలకు ఆశీర్వదం ఇస్తారు. దీంతో 45 రోజల పాటు ఎగువ అహోబిలంలోని ఉగ్ర నరసింహా స్వామిని, దిగువ అహోబిలంలో లక్ష్మీనరసింహా స్వామిని దర్శించుకొని భక్తులు శటారుకు దూరంగా ఉండాల్సి వస్తున్నది. శనివారం 10 వేల మంది ,స్వాతి నక్షత్రం రోజు 20 వేల మంది , సాధారణ రోజుల్లో రోజుకి రెండు వేల చొప్పున భక్తులు శటారుకు దూరం కాక తప్పదు. ఈ విషయాన్ని పూజరుల దృష్టికి తీసుకురాగా పారువేట గ్రామాల్లో వేలాది మంది భక్తులు వస్తారని వారికి ఏడాదికి ఒకసారైనా శటారు దక్కకుంటే ఎలా అని అన్నారు.
all the best