!జల ఉద్యమంతో శిల్పా అరంగేట్రం
!సమస్యలపై భూమా పోరుబాట
!సైకిల్ యాత్రతో బ్రహ్మంసై
జనాస్ట్రం ప్రతనిది మారంరెడ్డి జనార్దనరెడ్డి
నంద్యాల అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పార్టీ తరపున పోటీ చేయాలంటే గుండెకు బొచ్చు వచ్చి ఉండాలని సామేత. ఇది గ్రామీణ ప్రజలే కాదు రాజకీయం పై అవగహన ఉన్న ప్రతి నాయకుడు ప్రేర్కొనే సామేత. నంద్యాల అస్లెంబీ ఏర్పాడిన దగ్గర నుంచి 2004 వరకు జరిగన ఎన్నికలు ఒక ఎత్తు. అ తరువాత జరుగుతున్న ఎన్నికలు మరో ఎత్తు కావడంతో ఈ సామేతను స్థానికులు గుర్తుచేసుకుంటారు. 2004లో టిడిపి అభ్యర్థి ఫరూక్ పై కాంగ్రెస్ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డి గెలువడానికి ఎంతో కష్టపడాల్సి వచ్చంది. నంద్యాల నియోజకవర్గంలో పాదయాత్రతో పాటు నెల రోజుల పాటు శ్రీశైల జలలను నంద్యాల ప్రాంతంలో పారించడానికి భారీ ఎత్తున్న ఉద్యమాన్ని నిర్వహించాల్సి వచ్చంది. అంతేకాకుండా శిల్పా సమితిని ఏర్పాటు చేసి మహిళలకు రుణాలతో పాటు పింఛన్లు, రైతులకు ఎరువులు తదితర వాటిని అమలు చేయడానికి సొంత డబ్బును కోట్లలో పంచారు. అ తరువాత 2009లో అవలిలగానే ముకోణం పోటీలో విజయం సాధించారు. 2014లో జరిగిన ఎన్నికల్లో వైసిపి అభ్యర్థిగా పోటీచేసిన భూమా నాగిరెడ్డికి 20 ఏళ్లకు పైగా రాజకీయ అనుభవం ఉన్న నంద్యాల అస్లెంబ్లీలో రేయిబగుళ్లు కష్టపడాల్సి వచ్చింది. చివరి సిటికేబుల్‌లో డయల్ యువర్ భూమా అనే కార్యక్రమాన్ని అమలు చేసి సందు సందులో సమస్యలను స్వీకరించి అ సమస్యలను సొంత ఖర్చులతో పరిష్కరిస్తు రావడమే కాకుండా ఇళ్లు లేని వారికి ఇళ్ల స్థలాలు, చిన్న పరిశ్రమలు ఏర్పాటు చేసి ఉపాధి కల్పిస్తామని వేలాది మందితో దరఖాస్థులు తీసుకొని వారి దరి చేరుకున్నారు. పట్టణంలో ఇళ్ల మధ్య ఉన్న ఖాళీ స్థలాల్లో కంప చెట్లను తొలగించడం, ముస్లీం వార్డులలో పందులను నిర్ములిచడం, గోశాలను ఏర్పాటు చేయడం వంటి, యువకులకు ఇంటర్‌నెట్ సదుపాయం, ప్రధాన రహదారులలో సిసి కెమెరాలను ఏర్పాటు చేసి మూడు వేలకు పైగా విజయం సాధించారు. అ తరువాత భూమా వారసుడిగా పోటీ చేసిన భూమా బ్రహ్మానందరెడ్డి టిడిపి అభ్యర్థిగా పోటీ చేయడం ఆషమసిగా జరగలేదు. ఆయన కుడా దాదాపు 30 రోజులు నంద్యాల పట్టణంతోపాటు గొస్పాడు నంద్యాల మండలంలోని గ్రామాల్లో సైకిల్ యాత్రను జరిపి ప్రజల సమస్యలను తెలుసుకొన్నారు. ఈ ముగ్గురి పరిస్థితి ఇలా ఉంటే 2009లో పిఆర్‌పి అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చవిచుసిన ఏవి సుబ్బారెడ్డి కుడా పేద ప్రజల కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. వీటన్నిటిని విశ్లేషిస్తే నంద్యాల రాజకీయం చేయాలంటే గుండెకు బొచ్చు వచ్చి ఉండాలో లేదో మీరే చెప్పండి.