♦జనాస్త్రం ప్రతినిది మారంరెడ్డి జనార్ధనరెడ్డి
⇔40 ఏళ్ల చరిత్రలో 2014లో విభిన్నమైన తీర్పు…
⇔ఇక్కడ భూమా గెలుపు..అక్కడ చంద్రబాబు సిఎం
40 ఏళ్ల నంద్యాల నియోజకవర్గ ఎన్నికలను ఒకసారి పరిశీలిస్తే ఒక్కసారి మాత్రమే విరుద్ధమైన ఫలితాలు వచ్చాయి. స్థానికంగా గెలుపొందిన అభ్యర్థి ఏ పార్టీ నుండి పోటీ చేశారో ఆదే పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రావడం జరుగుతుంది. కానీ 2014లో వైఎస్ఆర్సిపి అభ్యర్థిగా భూమా నాగిరెడ్డి విజయం సాధించారు. అప్పుడు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం జరిగింది. 40 ఏళ్ల చరిత్రలో ఇలా జరగడం ఇదే ప్రథమం. 1983 నుండి ఒక్కసారి నంద్యాల ఎన్నికల పరిస్థితిని పరిశీలిస్తే 1983లో సంజీవరెడ్డి 1985,1994,1999 లో టిడిపి అభ్యర్థిగా పోటీ చేసిన ఎన్ఎండి ఫరూక్ స్థానికంగా గెలిచారు. ఈ నాలుగు సార్లు రాష్ట్రంలో టిడిపి అధికారంలోకి వచ్చింది.
1989లో రామనాథరెడ్డి, 2004, 2009లో శిల్పా మోహన్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగాను 2019లో శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి వైఎస్ఆర్సిపి అభ్యర్థిగాను పోటీ చేయగా రెండుసార్లు కాంగ్రెస్, ఆ తర్వాత వైఎస్ఆర్సిపి అధికారంలోకి వచ్చాయి. ఒక్క 2014 జనరల్ ఎన్నికలు మాత్రమే నంద్యాల ఓటర్లు విలక్షణమైన తీర్పుని ఇచ్చారు .2014 లో గెలుపొందిన భూమా నాగిరెడ్డి రెండేళ్లకు మృతి చెందేముందు టిడిపిలో చేరారు ఆ తర్వాత భూమా మృతి చెందడంతో ఆయన వారసుడిగా వచ్చిన భూమా బ్రహ్మానందరెడ్డి టిడిపి అభ్యర్థిగా పోటీచేసి విజయం సాధించారు.