జనాస్త్రం ప్రతినిది మారంరెడ్డి జనార్ధనరెడ్డి
* అహోబిలం పీఠాధిపతి ఉక్కు పాదం మోపే అవకాశం
* 18న గాని 19న గాని పలువురి పై చర్యలు
* వర్గాలుగా చీలిపోయారని ఆందోళన
* ఆలయ ఆదాయం తగ్గిపోతుందని ఆందోళన
దక్షిణాది రాష్ట్రాలలో శక్తివంతమైన ఆలయాలలో ఒకటైన అహోబిలం నరసింహస్వామి ఆలయంలో కొందరు ఉద్యోగులు,మఠం నియమించిన సలహాదారులు చకచక రాజీనామా చేయడం ఉన్నవాళ్ళలో కొందరు రాజీనామా చేయడంపై ప్రస్తుత అహోబిలంలో మకాం వేసిన శ్రీ రంగరాజ యతింద్ర మహాదేశీకన్ సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తుంది.కొందరు మఠం తరుపున పని చేసే అధికార్లు సిబ్బంది మఠం నిబంధనలకు లోబడి పనిచేయడం లేదని ఆగ్రహం తో ఉన్నట్లు సమాచారం.కొందరు సమర్థవంతంగా పనిచేస్తున్నారని,మరి కొందరు ఆలయ ఇమేజ్ ని దెబ్బతీసే విధంగా చేస్తున్నారని పీఠాధిపతికి ఫిర్యాదులు అందాయి.వాటన్నిటిని పరిశీలిస్తూ కొందరిపై వేటు వేయాలని నిర్ణయించారని సమాచారం.మొత్తం మీద హుండీ మొత్తాలతో ఆలయ ఆదాయం తగ్గి పోవడం ఎలా జరిగిందని ఆరాతీస్తున్నట్లు తెలిసింది.మొత్తం మీద తాను తీసుకొనే చర్యలను ,ఆదేశాలను అమలు చేసే అధికారి,స్థానికంగా తలెత్తే పరిస్థితులను ఎప్పటికీ కప్పుడు అణచి వేసే ట్రబుల్ షూటర్ ను ఎంపిక చేసే ఆలోచనలో పీఠాధిపతి ఉన్నట్లు సమాచారం. బ్రహ్మోత్సవాల కోసం అహోబిలం వచ్చిన పీఠాధిపతి మార్చ్ 18 తేది స్వాతి వేడుకలు చూసుకొని 19 తేదీ ఉదయం అహోబిలం నుండి బయలు దేరే అవకాశం ఉందని, ఆ లోపల ఉక్కు పాదం మోపే అవకాశం ఉందని తెలుస్తోంది..దీంతో ఎవ్వరి పై వేటు పడుతుందో నన్న భయం పలువురిని వెంటాడుతుంది.