♦జనాస్త్రం ప్రతినిది మారంరెడ్డి జనార్ధనరె్డ్డి
⇔కథ డ్యామిట్ అడ్డం తిరిగింది
⇔శిల్పా రవి ఎంపిక వెనుక ఎంతో కసరత్తు
⇔గత మూడు విజయాలు కుడా కలిసోచ్చాయి
⇔పార్లమెంట్‌కు ఇక్కడి నుంచి భారీ ఓటింగ్ పోల్ కావాలి
⇔ఫరూక్ సరైనా పోటీ రవే అని తేల్చిన సర్వేలు
నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎంతో మంది వైయస్ఆర్సిపి టిక్కెట్ కోసం ప్రయత్నం చేసినా చివరికి శిల్పా రవిచంద్రకిషోర్ రెడ్డి వైపే జగన్ మోహన్ రెడ్డి మొగ్గు చూపారు. దీంతో శిల్పా రవి చంద్రకిషోర్ రెడ్డి ఎన్నికల వ్యూహాం పై దృష్టిని సారించారు. పార్లమెంట్ నియోజకవర్గంలో ఏ అసెంబ్లీలో కుడా ఇంత పెద్ద ఎత్తున నాయకులు పోటీ పడలేదు. దీంతో చివరి వరకు నంద్యాల టిక్కెట్ పై ఉత్కంఠత సాగించారు. రవికి మాత్రం పార్టీ నుండి ఎప్పటికప్పుడు సమాచారం అందుతుండడంతో ఆయన పెద్దగా టెన్షన్ పడలేదు. బహిరంగ సభల్లో కుడా నా టిక్కెట్ … నా జేబులో ఉంది. అనుమానం లేదు… మీరు ధైర్యంగా ప్రత్యర్థులకు, నెగిటివ్ ప్రచారం మానుకొండి లేకుంటే టిక్కెట్ ప్రకటించే రోజు అవాక్కు అవుతారని రవి పదేపదే చెప్పే వారు. ఆయన తండ్రి మోహన్ రెడ్డి కుడా నా బిడ్డను రెండవ సారి గెలిపించి నా కుటుంబానికి నాలుగో గెలుపును ఇవ్వాలని బహిరంగ సభల్లో కోరుతూ వచ్చారు. వీరి వాదనలకు బలం చేకురుస్తూ పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి అండగా నిలిచారు. ఫరూక్‌ను టిడిపి అభ్యర్థిగా రెండు వారాల ముందు ప్రకటించడంతో జగన్ కుడా దాదాపు పది సర్వే టీములను నంద్యాలలో నియమించి 70 వేలకు పైగా మైనార్టీ ఓట్లు ఉన్న ప్రాంతాల్లో తిప్పి జల్లెడ పట్టారు. ఈ జల్లెడలో రవికే అనూకులంగా రావడంతో రవిని వైయస్ఆర్సిపి నంద్యాల అభ్యర్థిగా ఎంపిక చేసినట్లు సమాచారం. ఒకానొక దశలో రవిని పొరుగు నియోజకవర్గాల్లో పోటి చేయమన్నట్లు ప్రచారం జరిగింది. అలాగే ఆయన తండ్రి మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డిని కుడా బరీలోకి దించాలని చూసినట్లు ప్రచారం. వీరు కాకుండా మైనార్టీ నాయకులైన ఎమ్మెల్సీ ఇషాక్ బాషా, డా.నౌమాన్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు హబీబుల్లాలను కుడా ఎంపిక చేయడానికి సర్వేలు జరిపిన్నట్లు సమాచారం. అయితే సర్వేలు మైనార్టీ నాయకులతో పోలిస్తే ఫరూక్‌కే బలం ఉన్నట్లు తేలింది. ఫరూక్ ను ఢీకొనే సత్తా, ధైర్యం రవికే ఉన్నాయని పార్టీకి సమాచారం అందింది. అంతేకాక నంద్యాల పార్లమెంట్ లోకుడా అత్యధిక ఓట్లు నంద్యాల నుంచి పోల్ కావాలంటే రవి ఎంపికనే సరైనా నిర్ణయంగా పార్టీ భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి.