జనాస్త్రం ప్రతినిది మారంరెడ్డి జనార్ధనరెడ్డి
- వరుసగా శిల్పా అక్రమాలను బయట పెట్టి తీరుతా
- అంతం కాదు ఇది ఆరంభం
వైయస్ఆర్సిపి అసంతృప్తి నేత, ఫైర్ బ్రాండ్‌గా పేరు తెచ్చుకుంటున్న వైసిపి నాయకుడు నంద్యాల జడ్‌పిటిసి సభ్యుడు గొపవరం గొకుల్ కృష్ణా రెడ్డి మరోసారి వైసిపి నేతలైన ఎమ్మెల్యే రవిచంద్రకిషోర్ రెడ్డి, మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి పై నిప్పులు చెరిగారు. రోజు రోజుకు స్వరం పెంచడమే కాకుండా వివిధ శాఖల్లో జరుగుతన్న అవినీతి వీరి ఆధ్వర్యంలోనే కొనసాగుతున్నదని ఆరోపించడంతో శిల్పా వర్గీయులు అగ్రహాంతో ఊగిపొతున్నారు. ప్రత్యర్థులు మాత్రం మేము చేయని డ్యామేజీని గోకుల్ చేస్తున్నారని ఎవరో ఓకరు అవినీతిని వెలుగులోకి తేవడం సంతోషమని ఫరూక్ వర్గీలు పేర్కొంటున్నారు. మున్సిపాలీటిలో అక్రమంగా ఉద్యోగులను నియమించి వారి నుంచి లక్షలు దండుకొవడమే కాకుండా తమ ఇళ్ల దగ్గర పనులు చేయించుకుంటున్నారని ఆరోపించారు. మొత్తం మీద గత ఐదెళ్లలో శిల్పా కుటుంబంపై ఎవరు చేయని ఆరోపణలు గోకుల్ చేయడం హాట్ టాపిక్‌గా మారింది. ఇంతటితో తమ పోరాటం ఆగలేదని మరిన్ని అవినీతి అక్రమాలను వారి దగ్గరుండి చూశానని అవన్నీ ఇప్పుడు బయటికి తెస్తానని అంతం కాదు ఇది … ఆరంభం అంటూ గోకుల్ కృష్ణారెడ్డి విమర్శల వర్షం కురిపిస్తున్నారు.