జనాస్త్రం ప్రతినిది మారంరెడ్డి జనార్ధన రెడ్డి
- వరుసగా అసంతృప్తులను చేర్చుతున్న శివనరసింహ రెడ్డి
పాణ్యం అసెంబ్లీ, నియోజకవర్గంలోని వైయస్ఆర్సిపి యువ నాయకుడు, ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి తనయుడు ట్రబుల్ షూటర్‌గా పేరున్న కాటసాని శివనరసింహరెడ్డి తన వ్యూహాలకు పదును పెట్టారు. ఇప్పటికే ఎంతో మంది టిడిపి కార్యకర్తలను కాటసాని అభిమానూలుగా మార్చిన నరసింహరెడ్డి శనివారం మరో టిడిపి వికెట్‌ను పడగొట్టి తమ వైపు చేర్చుకున్నారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని ప్రకటించేలోపే ఆ పార్టీకి చెందిన 4, 5 మండలాల్లో అంసతృప్తిపరులను తమ వైపు తిప్పే యత్నం లోఉన్నారు. ఇందులో భాగంగా ఓర్వకల్లు మండలంలోని ఉప్పలపాడు గ్రామానికి, చెందిన ఆవుల అయ్య స్వామి తన నివాసంలో కర్నూలు మేయర్ డివై రామయ్య, ఎమ్మెల్యే రాంభూపాల్ రెడ్డితో పాటు మరి కొంతమంది నాయకుల సమక్షంలో వైసిపిలో చేరారు. ఇలా ఎంతో మంది తమకు టచ్‌లో ఉన్నారని వారందరినీ పాత నాయకులతో ఇబ్బంది లేకుండా చేర్చుకుంటామని కాటసాని రాంభూపాల్ రెడ్డి, శివనరసింహ రెడ్డిలు తెలిపారు. శివనరసింహరెడ్డి పాణ్యం నియోజకర్గంలో పార్టీ బలోపేతానికి చేస్తున్న కృషిని పలువురు అభినందించారు.