కూల్ కెప్టెన్ పోచా కే టికెట్ ఇవ్వాలి..పాణ్యం సూరి

నంద్యాల 

జనాస్త్రంప్రతినిది మారంరెడ్డి జనార్ధన రెడ్డి

కూల్ కెప్టెన్ గా పేరున్న నంద్యాల ఎంపి పోచాబ్రహ్మానందరెడ్డికే తిరిగి నంద్యాల పార్లమెంటు ఇంచార్జి భాద్యతలను అప్పగించాలని పాణ్యం మాజీ జడ్ పిటిసి సభ్యుడు కొండజూటూరు సూర్యనారాయణ రెడ్డి కోరారు..నంద్యాల పట్టణంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఐదుసంవత్సరాలపాటు నంద్యాల ఎంపిగా పోచా బ్రహ్మానందరెడ్డి ఎలాంటి వివాదాలకు తావు ఇవ్వకుండా ముందుకు సాగారని అన్నారు..ఐదేళ్ల పాటు పలు ప్రజోపయోగా కార్యక్రమాలను చేపట్టిన వైనాన్ని ఆయన వివరించారు.

1.నంద్యాల నుండి తిరుపతికి హైదరాబాద్ కు శబరిమలైకు భక్తులు నేరుగా వెళ్లేందుకు ఏర్పాట్లు చేశారని చెన్నై తోపాటుగా మరికొన్ని ప్రాంతాలకు కూడా రైళ్లు ేర్పాటు చేయాలని ప్రతిపాదనలను పంపి వాటిని అమలుచేయడానికి కేంద్ర రైల్వే మంత్రిపై వత్తిడిచేస్తున్నారన్నారు.

2.జమ్మలమడుగునుండి కోవెలకుంట్ల మీదుగా నంద్యాలవరకు పోర్ లైను రోడ్డును మంజూరు చేయించిన సర్వే పనులు ఆరంభించారని 

3 నంద్యాలనుంచి కల్వకుర్తి రోెడ్డును జాతీయ రహదారిగా మంజూరు చేయించడంలో పోచా కీలక పాత్ర పోషించారన్నారు.

4.రైతుల కోసం విత్తనాభివృద్దిని భారీ ఎత్తున అమలుచేయించారన్నారు.

5.నంద్యాలపట్టణంలోని బొమ్మల సత్రం నుంచి నూనేపల్లి బ్రిడ్జి మీదుగా అయ్యలూరు మెట్ట వరకు భారీ రహదారిని డివైడర్లను మంజూరు చేయించి వాహనాలకు వన్ సైడు సౌకర్యం కల్పించడంతపాటుడా ఆదునీకరణ చేయిస్తున్నారన్నారు..

6.రేనాటి గడ్డలోని మెట్ట‌భూముల్లో శ‌న‌గ పంట‌ను త‌గ్గించి నీటిపారుద‌ల పంటలు సాగుచేసుకోవ‌డానికి జోల‌ధోరాశి రిజ‌ర్వాయ‌ర్ నుంచి లిప్ట్ అమ‌లు చేయాల‌ని ప్ర‌భుత్వానికి ప్ర‌తిపాద‌నాలు పంపిన‌ట్లు తెలిపారు. గ‌తంలో ఇటువంటి ప్ర‌తిపాద‌న ఏ నాయ‌కుడు పంప‌లేద‌న్నారు. కోవెల‌కుంట్ల, దొర్నిపాడు, ఉయ్యాలవాడ మండ‌ల‌లోని పది వేల ఎక‌రాల‌కు మేలు చేకురుతుంద‌ని అన్నారు.

7.నంద్యాల ప‌ట్ట‌ణంలోని బ్రిడ్జి ద‌గ్గ‌ర అద్భుత‌మైన అండ‌ర్ బ్రిడ్జికి నిధులు మంజూరు చేయించార‌ని ఇలా ఎన్నో అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌ను ఏడు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల‌లో చేప‌ట్టార‌ని సూర్య‌నారాయ‌ణ రెడ్డి తెలిపారు. ఇలా ప‌నులు చేప‌ట్టిన పోచాకు తిరిగి పార్ల‌మెంట్ టిక్కెట్ ఇస్తే గ‌తం కంటే మంచి మెజార్జీని వ‌స్తుంద‌ని దీమాను వ్య‌క్తం చేశారు. ప్ర‌స్తుత రాజకీయ ప‌రిస్థితుల్లో నాన్ లోకల్ అభ్య‌ర్థులు గెల‌వ‌డం క‌ష్టమ‌ని అందువ‌ల్ల ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పురాలోచించుకొని పోచాకు టిక్కెట్ ఇవ్వాల‌ని కోరారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *