♣ జనాస్థ్రం ప్రతినిది మారంరెడ్డి జనార్ధనరెడ్డి
♥ అహోబిళంలో భక్తులకు జలపాతాల కనువిందు
♥ చూసిన వారికి చూసినంత
♥ మరో వారంరోజులు జలపాతాలు అగుపిస్తాయి
నల్లమల అటవీ ప్రాంతంలోని అహోబిలం పుణ్య క్షేత్రంలోని జలపాతాలు భక్తులను యాత్రికులను కేరింతలు కొట్టిస్తున్నాయి..దసరా శెలవులు ఉండటంతో దర్శనం కోసం వచ్చిన భక్తులు జలపాతాలను చూసి కేరింతలు కొడుతున్నారు..నరసింహస్వామిని దర్శనంచేసుకుంటే ఎంత ఆనందం కలుగుతుందో తమకు ఆకస్మికంగా కొండలునుంచి పెద్దపెద్ద శభ్దాలతో దుంకుతున్న జలపాతాలు తమను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయని మా ఆనందం ఆకాశమే హద్దుగా మారిందని పలువురు భక్తులు, యాత్రికులు అందులో యువకులు జనాస్థ్రంతో వివరించారు..చూసిన వారికి చూసినంత అన్న విదంగా జలపాతాలు అహోబిళంలో ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి..మోత్తం మీద అహోబిళం సందర్శించిన భక్తులకు అదనపు ఆనందంగా మారిందని ఆలయ పూజారులు ఆనందంతో విహరిస్తున్నారు..ఈ జలపాతాలు మరో వారం రోజులపాటు కొనసాగుతాయని అంచనా వేస్తున్నారు..