♦జనాస్త్రం ప్రతినిది మారంరెడ్డి జనార్ధనరెడ్డి
⇔శిల్పారవికి కూడా సెంటిమెంటు
⇔గతంలో శిల్పా,పరూఖ్,భూమాలు వరుస గెలుపులు
నంద్యాల ఎమ్మెల్యేగా ఒక్కసారి గెలిస్తే మరోసారి కూడా నంద్యాల నియోజకవర్గ ప్రజలు గెలిపించే సాంప్రదాయానికి అలవాటు పడ్డారు .ఇదే సెంటిమెంటు మరోసారి వర్కౌట్ అవుతుందని శిల్పా రవి అభిమానులు నమ్మకంతో ఉన్నారు .2019 లో జరిగిన ఎన్నికల్లో శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి మొదటిసారి నంద్యాల అసెంబ్లీకి ఎన్నికయ్యారు .గత ఎన్నికల చరిత్రను పరిశీలించి 2024 కూడా శిల్పా రవి గెలుపొందుతారని ఆయన అభిమానులు బల్లగుద్ది చెబుతున్నారు. ఇందుకు ఉదాహరణలు కూడా వారు వివరిస్తున్నారు .శిల్పా రవి తండ్రి శిల్పా మోహన్ రెడ్డి 2004, 2009లో వరుసగా రెండుసార్లు గెలుపొందారని అలాగే 2014లో భూమా నాగిరెడ్డి మొదటిసారిగా గెలుపొందారని అయితే ఆయన ఆకస్మిక మృతితో 2016లో ఆయన వారసుడిగా పోటీ చేసిన భూమా బ్రహ్మానందరెడ్డి రెండోసారి విజయం సాధించారని అంతకుముందు కూడా 1994,1999 లో ఫరూక్ కూడా రెండుసార్లు టిడిపి అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారని ఇప్పుడు కూడా రెండోసారి పోటీ చేస్తున్న శిల్పా రవికి సెంటిమెంట్ ప్రకారం విజయం వరించబోతుందని ఆయన అభిమానులు అంటున్నారు