♦జనాస్థ్రం ప్రతినిది మారంరెడ్డిా జనార్ధనరెడ్డి
⇔1985,1994,1999 గెలుపు….అధికారం
⇔ఈసారి అదృష్టాన్ని పరీక్షించుకోనున్న పరూఖ్
⇔20 ఏళ్ల తరువాత బరిలో పరూఖ్
ప్రస్తుతం నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గం నుండి టిడిపి అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఫరూక్ మూడుసార్లు గెలుపొందగా మూడుసార్లు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. మైనార్టీ కావడంతో మూడుసార్లు ఆయన మంత్రిగా కూడా అత్యున్నత పదవులు అలంకరించారు 1985,1994,1999లలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఫరూక్ నంద్యాల నియోజకవర్గం నుండి విజయం సాధించారు. మూడుసార్లు టిడిపి అధికారంలోకి వచ్చింది 2004లో టిడిపి అభ్యర్థిగా పోటీ చేసిన ఫరూక్ పరాజయం చెందారు .అప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది విచిత్రం ఏమిటంటే 2014లో టిడిపి అధికారంలోకి వచ్చింది కానీ ఆ ఎన్నికల్లో ఫరూక్ నంద్యాల అసెంబ్లీ టికెట్టు దక్కలేదు .కానీ ఫరూక్ అదృష్టం ఏమో కానీ ఎమ్మెల్సీగా చేసి మంత్రి పదవిని చంద్రబాబు నాయుడు కట్టబెట్టారు .ఈసారి ఎన్నికల్లో 20 ఏళ్ల తర్వాత అసెంబ్లీ కి ఫరూక్ పోటీ చేస్తున్నారు. గత సెంటిమెంటు ఏ మాత్రం వర్కౌట్ అవుతుందో అని రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు