జనాస్త్రం ప్రతినిది మారంరెడ్డి జనార్ధనరెడ్డి
* వైఎస్ఆర్సీపీ హయం లో…
* నంద్యాల జిల్లా కేంద్రం ప్రజల హక్కు
* ఆఫీసర్లు పై చర్యలు తప్పవు
నంద్యాల జిల్లా కేంద్రంలో కేంద్రీయ విశ్వవిద్యాలయంఏర్పాటు చేసితీరాలని నంద్యాల ఎం.ఎల్.ఏ రాష్ట్ర మంత్రి Nmd ఫరూక్ పట్టు బట్టినట్లు తెలుస్తుంది.నంద్యాల జిల్లా కేంద్రం ఆరంభమైన వెంటనే కేంద్రం కొత్త జిల్లాలకు కేంద్రీయ విద్యాలయం మంజూరు చేసింది.ఈ విద్యాలయంను అప్పటి మంత్రిగా ఉన్న బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి డోన్ లో ఏర్పాటు చేశారు.అప్పటి ఎం.ఎల్.ఏ,ఎంపీ శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి,పోచబ్రహ్మనంద రెడ్డి లు నంద్యాల ప్రధాన కేంద్రం కు అన్యాయం చేశారనే ఆరోపణలు ఎదుర్కొన్నారు.ఈవిషయాన్ని ఒక ప్రెస్ మీట్లో జనాస్త్రం ఎండ్.M.D. మారం రెడ్డి జనార్ధనరెడ్డి అప్పటి ఎం.ఎల్.ఏ శిల్పా రవి కిషోర్ రెడ్డి ని ప్రశ్నించగా ఈ విషయం ఎం.పీ దృష్టికి తెచ్చామని ఆయన ప్రయత్నం చేస్తున్నారని అన్నారు.వీరు ఏం చేస్తున్నారో ఎవరికి ఎరుక అన్న విధంగా సాగింది.అక్కడ బుగ్గన మాత్రం ఎగురేసుకొని వెళ్ళారు.ఐతే యిప్పుడు మంత్రి ఫరూక్ మాత్రం నూరు అరైన ఎంత తొందరగా వస్తే అంత మంచిది అని,లేకుంటే మీపై చర్యలు ఉంటాయని ఫరూక్ హెచ్చరించారు.గతం లో కూడా ఫరూక్ మంత్రిగా ఉన్న సమయంలో శాశ్వత పనులు చేసి మంచి పేరు తెచ్చుకున్నారు.ఇప్పుడు జిల్లా కేంద్రంలో ఏ కార్యాలయాలు ఉండాలో అన్ని ఇక్కడ ఉండాలని ఈమేరకు జిల్లా అధికారులను నివేదికలను సిద్దం చేయాలని ఆదేశించారు.ఫరూక్ ప్రయత్నం విజయవంతం కావాలని జనాస్త్రం కోరుకుంటున్నది..