♦జనాస్త్రం ప్రతినిది మారంరెడ్డి జనార్ధనరెడ్డి
⇔రాజకీయాల్లోకి రామకృష్ణా రెడ్డి
⇔ఆశీర్వదాలు పొందుతున్న నేతలు
⇔రామకృష్ణా విద్యా సంస్థలే నాకు ప్రాణం
⇔రాజకీయ పదవులు వద్దు … సేవ కార్యక్రమాలే ముద్దు
రాయలసీమలో పేరు ప్రఖ్యతులు సంపాదించుకున్న రామకృష్ణా విద్యా సంస్థల అధినేత డా.రామకృష్ణా రెడ్డి ఈసారి కుడా ప్రత్యక్ష రాజకీయాలలోకి రావడానికి విముఖత చూపుతుండడంతో ఆయనను అభిమానించే వేలాది మంది నిరుత్సాహానికి గురి అవుతున్నారు. కోవెలకుంట్లకు సమీపంలోని కలుగొట్ల గ్రామానికి చెందిన రామకృష్ణా రెడ్డి 30 ఏళ్ల క్రితం నంద్యాల పట్టణంలో డిగ్రీ, పిజి కేంద్రాలను ఏర్పాటు చేసి 1.50 లక్షల మందికి విద్యార్థిని, విద్యార్థులకు విద్యాభోధన చేశారు. ఆరు సంవత్సరాల క్రితం కళాశాల ప్రిన్సిపల్‌గా పని చేస్తూ ఉద్యోగ విరమణ చేశారు. అయితే రామకృష్ణా విద్యార్థులు రాష్ట్ర, దేశ, అంతర్జాతీయ స్థాయిలో ప్రయివేట్, ప్రభుత్వ రంగాల్లో ఉద్యోగాలు వేస్తున్నవారు 70 వేల మందికి పైగానే ఉంటారు. భారీ ఎత్తున సేవ కార్యక్రమాలను నిర్వహిస్తూ ప్రస్తుతం సరస్వతి విద్యా మందిరాలను అభివృద్ధి చేయడం పై దృష్టిని సారించారు. తన కళాశాల ఏర్పాటు చేసిన దగ్గర నుంచి ఇప్పటివరకు క్రేజ్ తగ్గకుండా అత్యుత్తమ విద్యా భోధనతో పాటు విద్యార్థులకు మౌలిక సదుపాయాలను కల్పించడం పై దృష్టిని సారించారు. దివంగత ఎంపీలు బొజ్జా వెంకటరెడ్డి, భూమా నాగిరెడ్డితో పాటు మరికొంత మంది నేతలతో సంబంధాలు కొనసాగించినా ప్రత్యక్ష రాజకీయాలకు గానీ, రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పోస్టులకు అవకాశం ఉన్న వాటిని తిరస్కరిస్తూ ముందుకు సాగారు. ఈ సారి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తారని అనుకున్నారు. ఆయనకు ఏమాత్రం ఇష్టం లేదని తెగేసి చెబుతుండడంతో అభిమానూలు నిరుత్సాహానికి గురి అవుతున్నారు.
ఆహ్వానాలు తిరస్కరించిన …
ఎన్నికల్లో పార్లమెంట్ స్థాయిలోనూ, నంద్యాల, ఆళ్లగడ్డ, బనగానపల్లె నియోజకవర్గాల్లో ఇక్కడ చదివిన విద్యార్థులు వేల సంఖ్యలో ఉంటారు. వీరిని ప్రభావితం చేసే అవకాశం ఉండడంతో అనేక సందర్భాల్లో రామకృష్ణా రెడ్డిని నంద్యాల నుంచి కానీ 2009కి ముందు కోవెలకుంట్ల నియోజకవర్గం నుంచి కానీ పోటీ చేయమని ప్రధాన రాజకీయ పార్టీల నుంచి ఆహ్వానం అందింది. అయితే తనకు ఏ మాత్రం ఆసక్తి లేదని చెప్పి పోటీ నుంచి తప్పుకున్నారు. 2024లో కుడా అవకాశం ఇస్తామని కొందరు రాష్ట్ర స్థాయి నాయకులు ఇంటికి వెళ్లి అడగగా సున్నితంగా తిరస్కరించారు. తనకు తన కళాశాలలో చదివే విద్యార్థులు ముఖ్యమని వారు అత్యున్నత హోదాలో ఉంటే అదే నాకు ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి పదవులు అని వివరించి సంతోషంగా వారిని వెనక్కి పంపారు. 2014లో తాము పోటీ చేస్తున్నామని ప్రధాన పార్టీ నాయకులు కలుసుకొని తమకు మదత్తు ప్రకటించాలని కోరారు. మొత్తం మీద ప్రస్తుతం పోటీలో ఉన్న ఒకరు, ఇద్దరూ ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థుల తరువాత రామకృష్ణా రెడ్డి బలవంతుడు అన్న విషయం తెలుసు. అందుకే ఆయన మద్దతు కోసం ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. మొత్తం మీద ఈ ఎన్నికల్లో ఎవరికి మదత్తు ఇస్తారో లేక ప్రశాంతంగా తమ కళాశాలల విధులు నిర్వహించుకుంటూ సైలెంట్ అవుతారోనన్న విషయం ఇప్పటికిప్పుడు తేలకపోవచ్చు.