జనాస్త్రం ప్రతినిది మారంరెడ్డి జనార్దనరెడ్డి
* 22న కడప కు రండి
* ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వర్ధంతి
* సై..సై సినిమాలో కీలక పాత్ర పోషించారు కాబట్టే
మూడు దశాబ్దాల నుంచి ప్రింట్ మీడియా,రచనలతో వేలాది మంది హృదయాలలో చెరగని ముద్ర వేసుకున్న రచయిత కాశీ పురం ప్రభాకర్ రెడ్డి కి మరోసారి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వర్ధంతి సందర్భంగా పాల్గొనాలని ఆహ్వానం అందింది.ఎన్నో సభలలో ప్రభాకర్ రెడ్డికి పాల్గొనే అవకాశం దక్కిన,ఇది కూడా అరుదైన అవకాశం అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సినిమాను చిరంజీవి తీస్తున్న సమయం లో నరసింహ రెడ్డి బ్రిటిష్ వారిపై దేశంలోనే మొదటి వారు అని చెప్పే బాధ్యత ను మన కాశిపురం కు సినిమా పెద్దలు అప్పగించారు.దీంతో కాశీ పురం ప్రభాకర్ రెడ్డి కూడా తీవ్ర స్థాయి లో స్పందించి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పై బ్రిటిష్ వారు జారీ చేసిన ఉత్తర్వుల కోసం అతి పురాతనమైన చెన్నై,లండన్,తో పాటు మరికొన్ని ప్రాంతాలకు సొంతంగా వెళ్లి పరిశీలించారు.అంతే కాక ఉయ్యాలవాడ నరసింహారెడ్డి నీ ఉరి తీసిన కోవెలకుంట్ల పట్టణంతో పాటు ఉయ్యాల వాడ తిరిగిన అహోబిలం,పెరుసోముల తదితర ప్రాంతాలకు సినిమా పెద్దలను తీసుకెళ్లి చూపించి అవగాహన పెంచే ప్రయత్నం చేసారు.ఒక్క మాట లో చెప్పాలంటే కాశీపురం సొంతంగా సినిమా తీశారా అన్నవిదంగా కష్టపడ్డారు.కానీ ఆయన కష్టానికి సై సై నరసింహ రెడ్డి సినిమాల్లో ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో తెలుగు రాష్ట్రాల నుంచి ఆందోళనలు జరిగాయి.దీంతో సినిమా పెద్దలు స్పందించి సినిమా లో ప్రభాకర్ రెడ్డి పేరు వేయడానికి అంగీకరించారు.ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే ఉయ్యాలవాడ పై ఎంత సమాచారం ప్రభాకర్ కు ఉందో చెప్పడానికి.ఇంత అవగాహన ఉన్న ప్రభాకర్ ను ఈనెల 22 వాతేది కడప పట్టణం లోని వైఎస్ఆర్ ప్రెస్ క్లబ్ ఉదయం జరిగే 178 వర్ధంతి సమావేశంకు హాజరు కావాలని నిర్వాహకులు కోరారు..బెస్ట్ ఆఫ్ లక్ ప్రభాకర్ రెడ్డి
అక్కడ కూడా మంచి పేరు తెచ్చు కోవాలని జనాస్త్రం కోరుకుంటున్నది.