జనాస్త్రం ప్రతినిది మారంరెడ్డి జనార్ధనరెడ్డి
! చిచ్చరా పిడుగే
! 108 కంటే వేగంతో సమస్యలు పరిష్కారం
! రాత్రి తండ్రి డైరెక్షను … ఉదయం తనయుడి యాక్షన్
! గతంలో వద్దురా బాబోయి … ఇప్పుడు ఆయనే కావాలి
ఎక్కడ అసంతృప్తి ఉన్న అక్కడికి 108 కంటే వేగంగా వెళ్లి ఆపరేషన్ చేస్తూ వైసిపిని భారీ మెజార్టీ వైపు తీసుకెళ్లే యత్నంలో పాణ్యం శాసన సభ్యుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి తనయుడు కాటసాని శివనరసింహరెడ్డి చేస్తున్నారు. తండ్రికి మించిన తనయుడు అని కార్యకర్తల్లో, నాయకుల్లో అనిపించుకుంటున్నారు.
ఈ విషయం అంతర్గతంగా తెలుసుకొని రాంభూపాల్ రెడ్డి కుడా పూర్తి స్వేచ్ఛనిచ్చి ముందుకు పంపుతున్నారు. పాణ్యం నియోజకర్గంలోని గడివేముల, పాణ్యం, ఓర్వకల్లు, కల్లూరు మండలాల్లో తెలుగుదేశం వైపు మొగ్గే వ్యక్తుల చిరునామాలు తెలుసుకొని సెకండ్లలో వాలి వారి సమస్యను మాటాల ద్వారా కాకుండా చేతల ద్వారా చూపేడుతున్నారని పార్టీ కార్యకర్తలు అంటున్నారు. గతంలో దూకుడు ప్రదర్శించిన నరసింహరెడ్డి ఇప్పుడు 60 ఏళ్ల పెద్ద మనిషి ఎలా చెబుతాడో అలా విభేదాలతో మగ్గిపోతున్న నాయకులకు వివరిస్తుండడంతో వారు నివ్వేరపోతున్నారు.
గతంలో నరసింహ స్పీడ్ ఎక్కువన్నా నువ్వే పంచాయితీ చేయాలని అనే వారందరూ లేదన్నా నరసింహనే మా ఊరికి, గ్రామానికి వచ్చి మాతో మాట్లాడితే సమస్య సెట్ అవుతుందని వివరిస్తున్నారు. 2019లో జరిగిన ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో అత్యధిక ఓట్లు సాధించిన కాటసానికి ఈ సారి ఒక 20 శాతానికి పైగా అధికంగా మెజార్టీని తెప్పించి తండ్రి ప్రశంసలతో పాటు వైయస్.జగన్ అభిమానం పొందాలని నరసింహరెడ్డి భావిస్తున్నారు. ప్రతిరోజు కాటసాని రాంభూపాల్ రెడ్డి నియోజకర్గంలో తిరిగి వచ్చిన తరువాత వన్ టు వన్ మాట్లాడుకొని వ్యూహాన్ని రూపొందించుకుంటున్నారు. ఉదయం పూట మిస్ ఫైర్ కాకుండా పార్ములాను నరసింహ రెడ్డి అమలు చేస్తున్నారు. తల నొప్పి సమస్యలకి నరసింహరెడ్డే సరైన వ్యక్తిగా కాటసాని భావిస్తున్నారు. మొత్తం మీద ఈ సారి ఎన్నికల్లో తానేంటో నిరూపించుకొవాలని శివనరసింహరెడ్డి ప్రయత్నానికి బెస్ట్ ఆఫ్ లక్క్ చెబుదాం.